37.2 C
Hyderabad
May 2, 2024 14: 58 PM
Slider నిజామాబాద్

తెలంగాణ వాటర్ మెన్: అపర భగీరథుడికి రైతుల కృతజ్ఞతలు

preshanth reddy

ఎండల కాలం వచ్చినా పుష్కలంగా నీటిని అందిస్తున్న అపర భగీరథుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాల్కొండ రైతాంగం ధన్యవాదాలు తెలిపింది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ ను పారించి దానితో చెరువులు నింపడంతో ఈ ప్రాంతంలో నిరంతరంగా నీళ్లు పారుతున్నాయని వారన్నారు.

వరద కాలువ నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు వేసవి కాలంలో కూడా నీరు పుష్కలంగా లభిస్తున్నదని వారు తెలిపారు. గుంత కూడా ఎండిపోకుండా తాగు నీరు అందిస్తూ రైతులకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించడం సామాన్యమైన విషయం కాదని వారన్నారు. ఎక్కడా కూడా లోవోల్టేజీ సమస్య రాకుండా రైతుల సంక్షేమం కొరకు పాటుపడుతున్న  అపర భగీరథుడు రైతు బాంధవుడు మన సీఎం కేసీఆర్ కు అలాగే మన బాల్కొండ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

నేడు జరిగిన ఈ సమావేశంలో రైతులు రేగుంట దేవేందర్, గడ్డం చిన్నారెడ్డి, మార్క్ శంకర్, పిప్పర అనిల్, ఏశాల నరసయ్య, బద్దం రాజేశ్వర్, బోడ దేవేందర్, బద్దం రాజశేఖర్, కొత్తపల్లి రఘు, సున్నం మోహన్, కుంట ప్రతాప్, గడ్డం శ్రీధర్, తీగల హరీష్, మోతిలాల్ నాయక్, గంగారెడ్డి, రెంజర్ల మహేందర్, సురేష్, ఏనుగు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

Satyam NEWS

పట్టుబడ్డ ఉగ్రవాదులు: భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు

Satyam NEWS

మంత్రి ప్రోగ్రాంకు ఎంతమందైనా వెళ్లవచ్చు..కరోనా రాదు

Satyam NEWS

Leave a Comment