37.2 C
Hyderabad
April 30, 2024 13: 35 PM
Slider ఆదిలాబాద్

బాసర యూనివర్సిటీకి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు

Amala Askok

ఆర్జీయూకేటీ బాసర విశ్వవిద్యాలయం  హైదరాబాదులో జరిగిన వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2020లో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును దక్కించుకుంది. ఈ  అవార్డును ఉన్నత విద్య, పరిశోధనలో అత్యుత్తమ ప్రదర్శన  కనబరిచినందుకు ప్రదానం చేశారని విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ ఏ అశోక్ తెలిపారు. ఈ అవార్డును రాజస్థాన్ ప్రభుత్వ ఉన్నత విద్య శాఖ కార్యదర్శి శుచి శర్మ, అన్నపూర్ణ కాలేజ్ మీడియా అండ్ ఫిల్మ్ డైరెక్టర్ అక్కినేని అమల చేతుల మీదుగా స్వీకరించారు.

ఈ వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో వ్యవసాయ రంగ౦, మహిళల భద్రత , రోడ్ల భద్రత లాంటి పలు అంశాల మీద విద్యార్థులు రూపొందించిన ఇన్నోవేషన్స్ ని ప్రదర్శించారు. ఈ అవార్డు రావడానికి కృషిచేసిన విశ్వవిద్యాలయ సిబ్బందినీ, విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ  కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కంఝవాలా కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

Satyam NEWS

రైతులను దగా చేసే మద్ధతు ధరలు

Bhavani

ఐకేసీ వరి కొనుగోలు కేంద్రం పరిశీలించిన పిడి

Satyam NEWS

Leave a Comment