Slider ఖమ్మం

కేసీఆర్ పాలనలో రైతులకు నష్టం జరుగదు

#Farmers

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రైతుబాంధవులు అని,వారి సుపరిపాలనలో రైతులకు ఎటువంటి కష్టం రాదని, ఎలాంటి నష్టం జరుగదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.పాపడ్ పల్లి-జాన్ పహాడ్ -మిర్యాలగూడ ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చాల్సిందిగా కోరుతూ ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాలకు చెందిన రైతులు ఎంపీ రవిచంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ రైతుల పక్షపాతి అని,వారి జనరంజక పాలనలో ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి నష్టం జరుగదని విస్పష్టంగా చెప్పారు.

ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్మెంట్ వల్ల బడుగు,బలహీన వర్గాలకు చెందిన సన్న, చిన్న కారు రైతులకే ఎక్కువగా నష్టం వాటిల్లనున్నందున,దీన్ని మార్చాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు,బండి పార్థసారథి రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.

Related posts

మళ్లీ బరితెగించిన రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

నిజామాబాద్ జిల్లాలో 2 వేలకే సిటిస్కాన్

Satyam NEWS

ఉక్రెయిన్ – రష్యా: యుద్ధం ఆరంభం అయినట్లేనా….?

Satyam NEWS

Leave a Comment