40.2 C
Hyderabad
May 2, 2024 18: 59 PM
Slider ముఖ్యంశాలు

భారంగా ఉన్నారని కూతుళ్ళ విక్రయం

#kamareddypolice

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. అప్పటికే అతనికి 14 సంవత్సరాల ఇద్దరు కూతుళ్లు(కవలలు)  ఉన్నారు. కూతుళ్ళకు తల్లి అవసరం ఉందని రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక కూతురు కొడుకు జన్మించారు. అయితే కూతుళ్లు పెద్దవాళ్ళు అవుతుండటం, నలుగురు పిల్లలతో రెండవ భార్యకు ఇబ్బందిగా మారుతుండటంతో తండ్రి ఓ నిర్ణయానికి వచ్చాడు. చిన్న వయసే అయినా ఇద్దరికి పెళ్లి చేసి భారం దించుకోవాలని భావించాడు.

ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే తనకు తెలిసిన బంధువుకు విషయం చెప్పాడు. అతను తనకు తెలిసిన రాజస్థాన్ కు చెందిన మార్వాడీ వ్యక్తి కామారెడ్డిలో వ్యాపారం చేసుకుంటున్నాడు. అతన్ని కలిసి విషయం చెప్పగా తనకు వరుసకు సోదరుడైన బంధువుతో తల్లి, తండ్రితో మాట్లాడించారు. చిన్న కూతురును అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దానికోసం 80 వేల కోసం ఒప్పందం కుదుర్చుకోగా ఇందులో మధ్యవర్తిగా వచ్చిన మార్వాడీకి 20 వేలు, సవతి తల్లి, తండ్రితో మాట్లాడిన వారి కులంకు చెందిన వ్యక్తికి 10 వేలు ఇచ్చారు. మిగిలిన 50 వేలు సవతి తల్లి, తండ్రికి ఇచ్చారు.

సెప్టెంబర్ 2022 లో అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ శివారులో పెళ్లి చేసుకున్న సదరు వ్యక్తి మనోహరాబాద్ మండలం దండుపల్లిలో కాపురం పెట్టి అమ్మాయికి ఇష్టం లేకున్నా బలవంతంగా శారీరకంగా అనుభవించాడు. అయితే సదరు వ్యక్తికి ఇదివరకే పెళ్లై భార్య ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలుసుకున్న అమ్మాయి అతన్ని నిలదీయడంతో ఆమెను కొడుతూ వేధించడం ప్రారంభించాడు. ఓ రోజు ఆమె తప్పించుకుని కామరెడ్డికి వచ్చి పోలీసులకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.

తనలాగే తన అక్కను కూడా మధ్యవర్తి ద్వారా డిసెంబర్ 2022 లో మరొక వ్యక్తికి 50 వేలకు అమ్మారని చెప్పగా అధికారులు మైనర్ బాలికలను రక్షించి బాలసధన్ లో ఉంచారు. డబ్బులు తీసుకుని మైనర్లకు వివాహం చేసిన సవతి తల్లి, తండ్రితో పాటు వివాహం చేసుకున్న మనోహరాబాద్ లో ఉంటున్న రాజస్థాన్ వాసి శర్మన్, బోయినిపల్లికి చెందిన కృష్ణ కుమార్, వివాహం కుదిర్చిన కామారెడ్డి వాసి కాల రాంబాటి, మధ్యవర్తులు రమేష్, మహేందర్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వీరి నుంచి 2 సెల్ ఫోన్లు, 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

పురుగులు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

Bhavani

పైడిమాంబ ఉత్స‌వాలు: అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి

Satyam NEWS

థ‌ర్డ్ వేవ్ సంకేతాల నేప‌ధ్యంలో అలెర్ట్ అయిన కొత్త ఎస్పీ దీపికా పాఠిల్….!

Satyam NEWS

Leave a Comment