39.2 C
Hyderabad
May 3, 2024 11: 40 AM
Slider కవి ప్రపంచం

బోధ చేయని గురువు!

#J Shayamala New

నీతి బోధలు చేయలేదు

పాఠాలు చెప్పలేదు

గద్దింపుల్లేవ్.. బెదిరింపుల్లేవ్

దండించే మాటే లేదు

చేసిందల్లా..

భుజాలపై మోసి ముద్దుచేయడం

తానే గుర్రమై ఆడించడం

ఆఫీసునుంచి వస్తూ

తాయిలాలు, ఆటబొమ్మలు తేవడం

అప్పుడప్పుడు షికార్లు, సినిమాలు

ఆపైన..పలకాబలపం  అందించి

బడిబాట పట్టించి

నా బంగరు భవితకు

బాసటగా నిలిచిన నాన్న

సంస్కారానికి ప్రతిరూపమై

మానవత్వానికి మణిదీపమై

ఆత్మీయతకు అసలు పేరైన

ఆదర్శమూర్తి  నాన్న

బోధ చేయని గురువుకు

నా భక్తిపూర్వక  కైమోడ్పు!

జె.శ్యామల

Related posts

గ్రహణంపై ప్రజలకు శాస్త్రీయ అవగాహన ఉండాలి

Satyam NEWS

హైదరాబాద్ ఫార్మా సిటీకి ఆర్ధిక సాయం చేయండి

Satyam NEWS

ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు లాడ్జిలో బస చేస్తే వివరాలు తెలపాలి

Satyam NEWS

5 comments

Mramalakshmi June 20, 2021 at 9:35 AM

Kavitha Chala bagundi madam?

Reply
GNMURTY June 21, 2021 at 11:22 AM

నాన్న మీద వ్రాసిన కవిత చాలా బాగుంది
నాన్న వెనకాల నీడలా నడిపిస్తాడు ప్రతీవాళ్ళనూ

Reply
విరించి June 21, 2021 at 12:25 PM

నాన్న గురించి ఎంత రాసినా తక్కువే…నాన్నని ఎంత చూసినా తక్కువే..అనుక్షణం మనని వెన్నంటి ఉండే నాన్న బోధ చేయని గురువే…అభినందనలు శ్యామల గారు.

Reply
Pushpa June 22, 2021 at 4:16 PM

బోధ చేయని గురువు నాన్న.. చాలా బాగా రాసారు మేడం?

Reply
Ramana Velamakakanni June 28, 2021 at 2:45 PM

Finishing of the poem too good. Nanna gurinchi enta raasina thakkuve. Enta thinna mukham mothani sweet . Anduke Kavita Anitha bagundi. Abhinandanalu.

Reply

Leave a Comment