39.2 C
Hyderabad
May 3, 2024 13: 52 PM
కవి ప్రపంచం

నాన్నా నీకు ప్రేమతో….

#PattemVasantha

వేలు పట్టి నడిపించిన నాన్న

నీ ప్రేమను పంచిన ఓ బాపు

నేనున్నానంటూ అనునిత్యం

వెన్నుతట్టి ప్రోత్సహించిన తండ్రి

భుజాలపై   ఎక్కించుకొని

కష్టాలు కన్నీళ్లు కనబడనీయక  

అహర్నిశలు శ్రమించిన బాపు

బాధ్యతలు ఎన్నింటినో మోస్తూ

సుఖమయమైన జీవితానికీ

బాటలు వేసిన  ఓ నాన్న

నీ ఎద పై ఆడిన ఆటలు

నీతో గడిపిన మధుర క్షణాలు

నీ జ్ఞాపకాలతో కన్నీటి తెరలు

అశ్రునయనాలుగా జాలువారుతూ

నేటికీ నా కళ్ళ చెమ్మ ఆరటం లేదు

నాన్నకు ప్రేమతో నా అక్షర నివాళి..

పత్తెం వసంత, కరీంనగర్

Related posts

స్వర్ణయుగం

Satyam NEWS

కాలచక్రం

Satyam NEWS

తెలుగు జాతి రత్నం

Satyam NEWS

Leave a Comment