38.2 C
Hyderabad
May 3, 2024 19: 06 PM
కవి ప్రపంచం

అవిశ్రాంత పథికుడు..నాన్న!

#Sujata P V L

పైకి కోపాన్ని ప్రదర్శించే

ఆ కళ్ళేప్పుడూ

కన్నవారి ఉన్నతిని కోరే

నవనీత నయనాలే..

తప్పటడుగులు వేస్తున్న ప్రతిసారి

నడకను, నడతను సరిచేసే

మార్గదర్శి..

బిడ్డల గొంతెమ్మ కోర్కెలు

తీర్చడానికి..

పడే కష్టాన్ని కూడా ఇష్టంగా భావించే నిత్యశ్రామికుడు..

కుటుంబ బాధ్యతనంతా

భుజస్కంధాలపై మోస్తూ

అలుపన్నది ఎరుగని

అవిశ్రాంత పథికుడు

బిడ్డలను ఎత్తైన శిఖరంపై చూసేందుకు

తాను పాతాళంలోకి కూరుకుపోడానికి సైతం

వెనుకాడని త్యాగధనుడు..

వెన్నెముకలా వెనుకే ఉంటూ

ముందుకు నడిపించే నారాయణుడు..

తనయులు తుష్టిగా బతకడానికి

పుష్టిని.. ధైర్యాన్నీ ఇచ్చే భరోసా..నాన్న!

సుజాత.పి.వి.ఎల్., సైనిక్ పురి, సికిందరాబాద్.

Related posts

కర్మయోగి

Satyam NEWS

చీకటి రేఖ సాక్షిగా

Satyam NEWS

నిశ్శబ్ద విప్లవం

Satyam NEWS

Leave a Comment