33.7 C
Hyderabad
April 30, 2024 02: 38 AM
Slider విజయనగరం

యోగా డే సందర్భంగా విజయనగరం లో 5 k రన్…!

#52K Run

ఈ నెల 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోబోతున్న దరిమిలా… అన్ని రాష్ట్రాల్లో ఒక్క రోజు ముందుగానే అదీ ఆదివారం పురస్కరించుకుని 5 కే రన్ నిర్వహించబడింది.

ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కేంద్రంలో కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 5 కే రన్ జరిగింది. ఈ మేరకు నగరంలో ని కిట జంక్షన్ నుంచీ జెడ్పీ ఆఫీసు వరకు జిల్లా రెవెన్యూ శాఖ అధికారి గణపతిరావు నేతృత్వంలో రన్ కొనసాగింది.

ఈ రన్ ను జేసీ కిషోర్ కుమార్ జేండా ఊపి ప్రారంభించారు.కోట జంక్షన్ నుంచీ సింహాచలం మేడ ,బాలాజీ, ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరీ జంక్షన్, జేడ్పీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ యోగా అవసరమని..వైద్య భాషలో శరీరంలో కి గొట్టాలు ద్వారా ఎక్కించే కృత్రిమ శ్వాస ను శాశ్వతంగా ఉంచుకోవడానికే యోగ అవసరమన్నారు.

శరీరం లోపల ఉన్న ప్రాణాన్ని తెలుసుకోవడమే యోగా అని ఇది భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉండేదన్నారు.ఇక కోట నుంచీ ప్రారంభమైన 5కే రన్ లో సింహాచలం మేడ వరకు జేసీ పాల్గొన్నారు.

అలాగే డీఆర్ఓ గణపతిరావు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ పాల్గొనగా..ఆర్డీవో భవానీ శంకర్ మాత్రం చివరి దాకా రన్ లో కొనసాగారు.ఈ రన్ లో పట్టుమని పదిమంది కూడా లేకపోవడం కొసమెరుపు.

Related posts

సెరిమోనియల్ పరేడ్ లో భావోద్వేగానికి గురైన డీఐజీ రాజ‌కుమారీ….!

Satyam NEWS

జగన్ ప్రభుత్వంపై మోదీ అసాధారణ ప్రేమ

Satyam NEWS

పువ్వాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేతలు

Bhavani

Leave a Comment