38.2 C
Hyderabad
May 5, 2024 22: 29 PM
Slider జాతీయం

ఈసారి కేరళ చల్లగా లేదు: వేడి మూడు డిగ్రీలు ఎక్కువ

munnar-hillstation-kerala

ఈ రోజుల్లో మున్నార్‌లో మంచు కురవడం చూడటం ఒక అద్భుతమైన దృశ్యం.  ఇప్పుడు మున్నార్‌లో మంచు లేదు.  ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల కంటే తగ్గలేదు. ఇతర ప్రాంతాల్లో, ఉష్ణోగ్రతలు సగటు కంటే మూడు డిగ్రీలు ఎక్కువగానే ఉంది. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రత తగ్గడం లేదు.

గత 30 ఏళ్లలో సగటు ఉష్ణోగ్రత తీసుకుంటే ముననార్ లో ఒక డిగ్రీ నుమచి మూడు డిగ్రీలకు పెరిగింది.  అధిక ఉష్ణోగ్రతలు (మధ్యాహ్నం పగటిపూట గరిష్టాలు) కూడా ఇదే రీతిలో ఉన్నాయి. మున్నార్ ఇప్పుడు వేడెక్కడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ సంవత్సరం వర్షపాతం చాలా భారీగా ఉందని కెఐ డైరెక్టర్ కె చంద్రశేఖర్ అన్నారు. దీనివల్ల వెచ్చగా ఉండి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

గత కొన్నేళ్లుగా కేరళలో ఉష్ణోగ్రత సాధారణం నుంచి పెరుగుతోందని ఆయన అన్నారు. హిందూ మహాసముద్రం డయాపోల్ పశ్చిమ హిందూ మహాసముద్రంలో పెరుగుతూనే ఉందని కొచ్చిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కృష్ణన్ కుమార్ చెప్పారు.

Related posts

యూరియా కోసం రైతుల పడిగాపులు

Satyam NEWS

దళిత యువకుల పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి 

Satyam NEWS

చనిపోయినా నలుగురికి గుర్తున్నాడు

Satyam NEWS

Leave a Comment