నవతరం పార్టీ నుండి ప్రజా సమస్యలపై గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పోరాడుతున్న తనపై 18న అర్థరాత్రి మొహాలకు కర్చీఫ్ లు కట్టుకుని హత్య చేసేందుకు వచ్చింది ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులని అనుమానంగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గుంటూరు రేంజ్ ఐ జి త్రివిక్రమవర్మ కు, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని కి ఫిర్యాదు చేశారు.
18న అర్ధరాత్రి12.25 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు తమ ఇంటి తలుపు కొట్టి సుబ్రహ్మణ్యం అన్నా బయటకు రావాలని మాట్లాడాలని పిలువగా ఎవరు మీరని అడిగితే బయటకు రమ్మనండి మాట్లాడాలని చెపి ప్రక్కకు నిలబెట్టారని ఆయన తెలిపారు. వెంటనే దిశా యాప్ ద్వారా పోలీసులు కు ఫోన్ చేయడం చూసి వారు పరారయ్యారని, వెంటనే పట్టణ సి ఐ రాజేశ్వరరావు స్పందించి పోలీసులను పంపించటంతో వారి కుట్ర భగ్నం అయిందని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఎమ్మెల్యే మరిది విడదల గోపి, ఎమ్మెల్యే మామ విడదల లక్ష్మీ నారాయణ సైతం రావు సుబ్రహ్మణ్యం కు ఫోన్లు చేసి తమ విషయం లో స్పందించ వద్దని చెప్పడంతో వారి అనుచరులు మాత్రమే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారని రావు సుబ్రహ్మణ్యం ఐజీ కి,ఎస్పీ కి పిర్యాదు చేసారు. యడవల్లి రైతులకు, బొప్పూడి రైతులకు, చెంచులు భూముల విషయంలో అండగా నిలిచానని, కూరగాయలు మార్కెట్ పెరు మార్పు విషయంలో స్పందించిన విషయం ఇంకా అనేక విషయాలు రావు సుబ్రహ్మణ్యం ప్రశ్నించిన నేపధ్యంలో హత్యాయత్నం కు పాల్పడివుండవచ్చని ఫిర్యాదు లో పేర్కొన్నారు.
తనకు వ్యక్తిగత శత్రువులు లేరని విడదల రజనీ కుటుంబం తో ప్రాణ నష్టం జరిగే వీలుంది అని, తనకు ప్రాణహాని కలిగినా,తనపై ఎటువంటి దాడి జరిగిన నైతిక బాధ్యత ఎమ్మెల్యే విడదల రజనీ, ఆమె మరిది విడదల గోపి,ఆమె మామ విడదల లక్ష్మీనారాయణ వహించాల్సిందే అని రావు సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. నవతరం పార్టీ నేతలు గోదా రమేష్ కుమార్,గట్టినేని శివన్నారాయణ,వి సాయి,మెరుగ విజయ రాజు,బత్తుల శివ,బత్తుల అనిల్,గోపిశెట్టి అశోక్ తదితరులు తో కలసి గుంటూరు లో పిర్యాదు చేసారు.
నవతరం పార్టీ నేత గోదా రమేష్ మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణ సి ఐ స్పందించిన తీరు కు కృతజ్ఞతలు తెలిపారు. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గొంతు నొక్కేందుకే హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని,ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పోకడ మంచిది కాదని ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయ వద్ద నిరసన తెలుపుతామని,రావు సుబ్రహ్మణ్యం కు ప్రభుత్వ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.