37.2 C
Hyderabad
May 2, 2024 14: 59 PM
Slider సంపాదకీయం

జగన్ మంత్రి వర్గం ఫైనల్ లిస్టు విడుదల

#cmjagan

జగన్ మంత్రి వర్గం తుది జాబితా అనధికారికంగా విడుదల అయింది. అందరూ ఊహించినట్లుగానే హెవీ వెయిట్స్ అయిన బొత్స సత్యానారాయణ, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిలను మంత్రి వర్గం నుంచి తీసేసే సాహసాన్ని జగన్ చేయలేకపోయారు. అదే విధంగా సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావును మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారు.

ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా కొనసాగించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్ధిక మంత్రిని మార్చడం కరెక్టు కాదని ఆయన భావించారో ఏమో తెలియదు కానీ బుగ్గన మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. అత్యంత వివాదాస్పదరాలైన విడదల రజనిని ఈ సారి మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారు.

అదే విధంగా మాటలతో ప్రతిపక్షాలకు చెందిన కాపు నాయకులపై విరుచుకుపడే అంబటి రాంబాబు కూడా మంత్రి కాబోతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అభ్యంతరాలను జగన్ పట్టించుకోలేదు. ఆ జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కి కిరీటం పెట్టారు. పినిపె విశ్వరూప్‌, గుమ్మనూరు జయరాం మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యంతరాలను కాదని ఆర్ కె రోజాకు జగన్ మంత్రిపదవి ఇస్తున్నారు. ముందుగా రామచంద్రారెడ్డిని పక్కన పెట్టి రోజాకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ధికంగా బలవంతుడు కావడంతో పక్కన పెట్టలేక ఆయనకు, ఆయనతో బాటు రోజాకు అవకాశం కల్పిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు కేబినెట్ పైనల్ లిస్టు ఇది:

గుడివాడ అమర్నాథ్‌

దాడిశెట్టి రాజా

బొత్స సత్యనారాయణ

రాజన్నదొర

ధర్మాన ప్రసాదరావు

సీదిరి అప్పలరాజు

జోగి రమేష్‌

విశ్వసరాయ కళావతి

అంబటి రాంబాబు

కొట్టు సత్యనారాయణ

తానేటి వనిత

కారుమూరి నాగేశ్వరరావు

మేరుగ నాగార్జున

బూడి ముత్యాలనాయుడు

విదుదల రజిని

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అంజాద్‌ భాష

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

పినిపె విశ్వరూప్‌

గుమ్మనూరు జయరాం

ఆర్కే రోజా

ఉషశ్రీ చరణ్‌

తిప్పేస్వామి

చెల్లుబోయిన వేణుగోపాల్‌

నారాయణస్వామి

Related posts

అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు

Satyam NEWS

‘వీరసింహారెడ్డి’ ప్రభంజనాన్ని ఎలా అడ్డుకోవాలి?

Bhavani

950 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల ఫలితాలు

Bhavani

Leave a Comment