30.2 C
Hyderabad
May 13, 2024 14: 33 PM
Slider విజయనగరం

ఇప్పటికీ పలు సార్లు ఎగ్గొట్టారు..ఈ సారి కట్టాల్సిందే..

#vijayanagarampolice

విజయనగరం లో ప్రైవేటు బస్సుల జరీమానా పై ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు…!

విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రైవేటు బస్సులకు ఫైన్ లు ఎన్ని పడినా..వాటిని లెక్క చేయకుండా …పోలీసులు… అందునా ట్రాఫిక్ పోలీసులు ఏమీ పట్టించుకోరులే అన్న ధీమా లో ఉంది. ప్రైవేటు బస్సు లు వ్యవహారశైలి. ఆ మధ్య నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ హరిబాబు.. ఓ ప్రైవేటు బస్సు ను ఆపితే గాని.. ఆ బస్సు కు పడ్డ జరీమానా లు చెల్లించలేదు.

ఆ తర్వాత చాలా బస్సు లు నిబంధనలు గాలికొదలడం తో అక్కడక్కడా ఫైన్ లు వేస్తునే ఉన్నారు. తాజాగా ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ను ఆపితే గాని.. దాదాపు ఎనిమిది వేలకు పైగా ఫైన్ ల రూపంలో చెల్లించలేదని..ట్రాఫిక్ ఎస్ఐ దామోదర్ చేసిన తనిఖీ లో వెల్ల డైంది.కాంప్లెక్స్ వద్ద ఆ బస్సు ను ట్రాఫిక్ పోలీసులు ఆపితే.. బస్సు లో ప్రయాణికులు చాలా దూరం ప్రయాణించాలని..హైదరాబాద్ వెళ్లి అక్కడ బస్ యజమాని తో సంప్రదించి..పెండింగ్ జరీమానా లు ఋడతాని విజయనగరం లో బస్ నిర్వాహకులు చెప్పారు.

అయితే కనీసం రెండు అయినా కట్టాలని ట్రాఫిక్ ఎస్ఐ బతిమాలడం విశేషం. అదే సమయంలో కాంప్లెక్స్ వద్ద దృశ్యం… “సత్యం న్యూస్. నెట్” కంటపడింది.సదరు ప్రైవేటు బస్సు నిర్వాహకులు…ట్రాఫిక్ ఎస్ఐ వాదనలను క్లిక్ మనిపించింది.అంతలో నగర వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు..ఘటనా స్దలికి వచ్చారు.. కనీసం కొన్ని అయినా కట్టాలని బస్సు లో ప్రయాణీకులకు ఇబ్బందులు పడకుండా చూడాలని చెప్పడంతో అప్పటి కి బస్సు నిర్వాహకులు.. ఓనర్ తో మాట్లాడించడంతో అక్కడికి సమస్య పరిష్కారానికి వచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది.

Related posts

కైండ్ నెస్: మానవత్వం మూర్తీభవించిన కేసీఆర్

Satyam NEWS

రైతాంగ బిల్లుల ర‌ద్దుకు శ్రీ‌కాకుళంలో నిర‌స‌న‌

Sub Editor

చిన్న చిన్న సమస్యలకు పోలీస్ స్టేషన్లకు రావద్దు

Satyam NEWS

Leave a Comment