28.7 C
Hyderabad
May 5, 2024 23: 59 PM
Slider మహబూబ్ నగర్

కార్మికులకు కనీస వేతనాలు అందచేయాలి

#liftirrigation

మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ( ఎం జి కే ఎల్ ఐ) ఏల్లూరు ప్రాజెక్టు లో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. అదేవిధంగా రోజువారి పని గంటలు కార్మిక చట్ట ప్రకారంగా 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని కూడా కోరారు. ఏఐటీయూసీ, మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రెటరీ రాము, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మారేడు శివశంకర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ ఈ మేరకు ఎం జి కే ఎల్ ఐ ఎల్లూరు ప్రాజెక్టు మొదటి లిఫ్టు ఇన్చార్జి శ్రీనాథ్ కు వినతి పత్రం అందచేశారు.

కార్మికులకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని వారు కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కార్మికులకు ఫోన్స్ సౌకర్యం అందుబాటులోకి తేవాలి, అత్యవసర వాహన సౌకర్యం కూడా కల్పించాలి, కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలి, ఈఎస్ఐ కార్మికులకు వర్తింప చేయాలి అని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. మెగా కంపెనీ ఎంజీకేఎల్ఐ కార్మికులతో వెట్టిచాకిరి చేపించుకుంటున్నారని ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటి యుసి అనుబంధ ఎం జి కే ఎల్ ఐ కార్మికులు, సంతోష్, కురుమూర్తి, వెంకటేశ్వర్లు, రమేష్, పాలని, రవి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జేఎన్టీయూ కాలేజీ పేరుతో కోట్ల రూపాయల అవినీతి

Bhavani

ఎస్ఐగా ఎంపికైన కానిస్టేబుల్ అజయ్ ను అభినందించిన జిల్లా ఎస్పీ దీపిక

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితం

Satyam NEWS

Leave a Comment