30.7 C
Hyderabad
April 29, 2024 06: 04 AM
Slider ముఖ్యంశాలు

పప్పు దినుసులకు అధిక ధర చెల్లించ వద్దు

dal rate

పప్పు దినుసుల ధరల పట్ల వినియోగ దారులు అప్రమత్తంగా ఉండాలని ద హైదరాబాద్ దాల్ మిల్స్ మార్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షడు వినోద్  కుమార్ కిమ్త్, ప్రదాన కార్యదర్శి సంజయ్ మిత్తల్, ఉపాద్యక్షులు రాజేందర్ అగ్రవాల్, సోహాన్ లాల్ జోషి లు నేడొక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

లాక్ డౌన్ ను ఆసరాగా తీసుకొని నగరంలోని కొందరు రిటైల్ వ్యాపారస్తులు పప్పు దినుసులను ఇస్టాను సారంగా విక్రయిస్తున్నారని అది సరికాదని వారు పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా క్రయ విక్రయాలను ప్రభుత్వం లాక్ డౌన్ నుండి మినహాయించిందని వారు తెలిపారు.

ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారస్తులు అధిక ధరలకు విక్రయిస్తు వినియోగదారులను మోసం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. పప్పు దినుసులను కిలో 10 నుండి 25 రూపాయల వరకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని అందుకే తాము స్పందించవలసి వచ్చిందని తెలిపారు.

ఈ సందర్బంగా వారు హోల్ సేల్ ధరల సూచీని విడుదల చేశారు. కిలో కంది పప్పు 1.నంబర్ 88 రూపాయల నుండి 90 రూపాయలు, 2. నంబర్ 80-82, మినపపప్పు 1. నంబర్.115 -120, నంబర్.2.95-100, ఏర్రపప్పు 80, నుంబార్ 2.74, పెసరపప్పు 117, శనగపప్పు 52, చక్కర 34-50 ఉన్నట్లు తెలిపారు. వీటిని రిటైల్ మార్కెట్ లో 2 నుంచి 3 రూపాయలు అధికంగా వేసుకొని విక్రయించుకోవచ్చునని తెలిపారు.

Related posts

విజయనగరం ఖాకీలలో పెల్లుబుకుతున్న సేవా దృక్పథం…!

Satyam NEWS

పంచ్ ప్రభాకర్ ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు?

Satyam NEWS

అరాచ‌క శ‌క్తుల కుట్ర‌లు.. పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Sub Editor

Leave a Comment