23.2 C
Hyderabad
May 8, 2024 00: 22 AM
Slider జాతీయం

జెండా వివాదం: జోధ్ పూర్ లో మత ఘర్షణలు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో గత రాత్రి రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జలోరీ గేటు వద్ద ఉన్న జెండా పీకేసి మరో జెండాను పెట్టడంపై వివాదం మొదలైంది.

అనంతరం ఇరువైపులా రాళ్ల దాడి మొదలైంది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నేడు జరుపుకుంటున్న ఈద్, అక్షయ తృతీయ పండుగ ముందు రోజు రాత్రి జరిగిన ఈ రచ్చను నిరోధించడానికి నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

రాళ్లదాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. నగరంలో వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉంది. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, సామరస్యాన్ని కాపాడుకోవాలని జోధ్‌పూర్ జిల్లా యంత్రాంగం ఇరువర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Related posts

హుజూర్ నగర్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి

Satyam NEWS

జగన్ ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి

Satyam NEWS

మున్నాభాయ్:హత్య కేసులో జైలుకు మెడిసిన్ పూర్తి

Satyam NEWS

Leave a Comment