38.7 C
Hyderabad
May 7, 2024 15: 42 PM
Slider వరంగల్

జానపద కళాకారులను ఆదుకున్న రమణాచారి

#FlockArtists

కరోనా కష్ట కాలంలో కుటుంబ పోషణ భారం అధికమైన కళాకారులకు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి తన వంతు సాయం అందించారు.

ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన  ప్రాంగణంలో ములుగు జిల్లా లోని నిరుపేద జానపద కళాకారులకు నిత్యావసర వస్తువులను అందచేశారు.

జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుంచు లింగయ్యల చేతుల మీదుగా ఎంపిక చేసిన నిరుపేద పౌరాణిక,యక్షగానం, చిరుతల రామాయణం, కోలాటం భజన బృందాల కళాకారులకు 5 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను అందచేశారు.

కె.వి రమణాచారి సమకూర్చిన నిత్యావసర వస్తువుల కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరుపేద కళాకారులకు అందచేస్తున్నామని తెలిపారు.

కళాకారుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలను చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్  గౌడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి భూపాలపల్లి జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు నిమ్మల రాజు, ప్రధాన కార్యదర్శి బుసగొండ రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పకాయల సదానందం,సీనియర్ కళాకారులు పోరిక శ్యామ్ నాయక్,రేలా విజయ్,చల్లగురుగుల మల్లయ్య తదితర కళాకారులు పాల్గొన్నారు.

Related posts

50వ రోజుకు చేరిన రాయపూడి రైతుల దీక్ష

Satyam NEWS

నిజాం నిరంకుశ పాలన తలపిస్తున్న కేసీఆర్ పాలన

Satyam NEWS

నిరుపేద మృతుడి దహన సంస్కారాలకు సాయం అందించిన తస్లీమా

Bhavani

Leave a Comment