35.2 C
Hyderabad
April 30, 2024 23: 48 PM
Slider ముఖ్యంశాలు

తిరుమలలో డిక్లరేషన్ విధానాన్ని ఎత్తేయాల్సిందే

#KodaliNani

తిరుమలలో డిక్లరేషన్‌ విధానాన్ని ఎత్తేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పునరుద్ఘాటించారు. హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొన్న మంత్రి కొడాలి నాని తన వైఖరి మార్చుకోలేదు సరికదా తన అభిప్రాయం అదేనని విస్పష్టంగా చెప్పారు.

‘‘ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారు. సీఎం జగన్‌ హిందువుల ప్రతినిధిగా మాత్రమే వెళ్లడం లేదు’’ అని ఆయన వెల్లడించారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం చేయాలనడం నీచ రాజకీయమని ఆయన అన్నారు.

 ‘‘సోము వీర్రాజుకు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలా?.. నేనేం తప్పు మాట్లాడలేదు. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా’’ అని ఆయన స్పష్టం చేశారు.

Related posts

పట్టభద్రుల ఎన్నిక: ప్రజాస్వామ్యానిదే ఈ విజయం

Satyam NEWS

బూడిదైన పత్తి: ఓ రైతు కుటుంబానికి తీరని నష్టం

Satyam NEWS

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం తప్పదు

Satyam NEWS

Leave a Comment