28.7 C
Hyderabad
April 27, 2024 03: 38 AM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో వేడుకగా 680 పాఠశాలలు ప్రారంభం

#school

మన ఊరు- మన బడి కార్యక్రమం-తొలి విడత కింద పనులు పూర్తయి.. కొత్త రూపు సంతరించుకున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  680 బడులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలు, గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేడుకలా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులతోపాటు గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొని కేజీ టూ పీజీ ప్రాంగణాన్ని ప్రారంభించారు.హైదరాబాద్‌లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మూడు పాఠశాలల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఖమ్మం లో పువ్వాడ అజయ్ కుమార్ , జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మణ్‌తండా ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. బడ్జెట్‌ రూపకల్పన, ఇతర పనుల్లో బిజీగా ఉన్నందున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరుకాకపోవడంతో సిద్దిపేట నియోజకవర్గంలో బడులు ప్రారంభం కాలేదు.

Related posts

అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలతో జాదవ్‌కు స్వల్ప ఊరట

Sub Editor

Leave a Comment