28.7 C
Hyderabad
May 6, 2024 07: 40 AM
Slider మహబూబ్ నగర్

అడవి మట్టిని దోచుకుంటున్న కొల్లాపూర్ పెద్దలు

#Kollapur Forest

రియల్ ఎస్టేట్ దొంగలు అడవిని, అడవిలో మట్టిని కూడా దోచేస్తున్న దారుణమైన సంఘటన కొల్లాపూర్ అటవీ ప్రాంతంలో జరుగుతున్నది. కొల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న మట్టి గట్టును కాంట్రాక్టర్లు తొలిచేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులతో  భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకొని మట్టిని దోచుకుతింటున్నారు.  సోమశిలకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలోని ఈ గట్టు పర్యావరణ పరంగా ఎంతో ముఖ్యమైనది. ఈ గట్టు అడ్డు లేకపోతే అడవికి రక్షణ ఉండదు. పర్యావరణ పరంగా అరిష్టాలు ప్రారంభం అవుతాయి.

అలాంటి అతి ముఖ్యమైన మట్టి గట్టును రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొట్టేస్తున్నారు. కొల్లాపూర్  రెవెన్యూకు సంబంధించిన కొండ భూములను కరిగిస్తున్నారు. భారీ ఎత్తున హిటాచి టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. కొల్లాపూర్ మండల సమీపంలో సోమశిల గ్రామానికి వెళ్లే దారిలో రామాపురం శివారికి సంబంధించిన అడవిలో భారీ ఎత్తున రియల్ వ్యాపారులతో కాంట్రాక్టర్స్ గట్టు కొండను కరిగించి రియల్ వ్యాపారంపై పడ్డారు. 

ఈ అంశంపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా రెండు రోజులైనా అడ్డుకోలేక పోయారు. ఆదివారం సెలవు ఉందని, పోలీస్ స్టేషన్ కు చెప్పానని తాహసిల్దారు చెప్పారు. కానీ పోలీస్ స్టేషన్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం రెవెన్యూ సిబ్బంది కూడా వెళ్లి కలవలేదు.

నోట్ ద్వారా తెలుపలేదని కూడా తెలిసింది. ఇదే అలుసుగా తీసుకున్న ఆ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా రియల్ రియల్ వెంచర్లకు కు భారీ ఎత్తున మట్టి తరలించారు.  సోమవారం ఈ అంశంపై తాహసిల్దార్ వివరణ ఇలా ఉంది. గంట క్రితమే పోలీసులకు సమాచారం ఇచ్చాం తవ్వకాలు అడ్డుకున్నారు. తవ్వకాలు నిలిచిపోయాయని తాహసీల్ధార్ చెప్పారు.

ఇక పోతే ఆ భూమికి పట్టా ఉంది. అనుమతులు మంగళవారం తీసుకుంటామని ఆ కాంట్రాక్టర్ పెంట్ల వెలికి చెందిన యం. భాస్కర్  చెబుతున్నారు. మొత్తంమీద మట్టి తరలింపు నిలిచిపోయాయి. అనుమతులు లేకుండా గట్టును కరిగించి మట్టిని తరలించిన కాంట్రాక్టర్ల పై వాల్టా చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అంటున్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ ఏక్బాల్ చెప్పారు.

Related posts

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఫిట్ ఇండియా రన్

Satyam NEWS

రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన జూపల్లి

Satyam NEWS

సివిక్ ప్రాబ్లమ్స్: పాలన పట్టించుకోని తెలంగాణ పాలకులు

Satyam NEWS

Leave a Comment