38.2 C
Hyderabad
April 27, 2024 17: 12 PM
Slider ప్రత్యేకం

నేనైతే ఎంపీ గానే పోటీ చేస్తాను: రఘురామ కృష్ణంరాజు

#raghuramaraju

రానున్న ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, తానైతే  ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వస్తున్న ఊహగానాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా, ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. రిజర్వుడు స్థానాలను మినహాయించి, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా  పోటీ చేసినా తనను తాను పరిచయం చేసుకోవలసిన అవసరం లేకుండానే ప్రజలే రాజుగారు రండి అని ఆహ్వానిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవసరం తనకు రాదని, ఒకవేళ ఆ అవసరమే వస్తే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి అయినా పోటీ చేయవచ్చునని చెప్పారు. నరసాపురం ఎంపీ టికెట్  ఇప్పటికీ తనకు కేటాయిస్తారనే ఆశాభావంతోనే ఉన్నట్లుగా  రఘురామ కృష్ణంరాజు పునరుద్ఘాటించారు. 2009 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ టికెట్ బిజెపి తరఫున శ్రీనివాస్ వర్మకే కేటాయించారని, అప్పుడు పొత్తులు లేవు కాబట్టి ఆయన విజయం సాధించలేకపోయారన్నారు. ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిగా  శ్రీనివాస్ వర్మ కు  టికెట్ కేటాయించాలన్న బిజెపి  నాయకత్వ నిర్ణయం ముదావహమని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక లోను ఇవే ప్రమాణాలను పాటించక పోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు.

రాష్ట్ర నాయకత్వం నివేదించిన తప్పుడు సమాచారం వల్లే తనకు టికెట్ లభించలేదని, అంతేకానీ కేంద్ర బిజెపి నాయకులకు తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. ఇక్కడే ఏదో జరిగి ఉంటుందనేది తన భావన అని పేర్కొన్నారు. రాష్ట్ర బిజెపి నాయకులతో గత నాలుగు ఏళ్ళు గా తనకు పెద్దగా సంబంధాలు లేవని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగినప్పుడు ఆయనతో ఉన్న పరిచయం వల్ల బిజెపి నాయకులతో చక్కటి సంబంధ బాంధవ్యాలే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఆయన కూడా తెదేపాలో చేరిపోవడం వల్ల, రాష్ట్ర బిజెపి నాయకులతో పెద్దగా పరిచయాలు లేకపోవడమే తనకు సీటు రాకుండా దెబ్బేసిందేమోనని వ్యాఖ్యానించారు.

ఇప్పటికీ నరసాపురం స్థానాన్ని  తనకు కేటాయిస్తారని  ఆశిస్తున్నట్లుగా పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు నా జాతక ప్రకారం రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందని చెప్పారు. ఎంపీ స్థానాన్ని  పార్టీలు ఇస్తాయా? ప్రజలు ఇస్తారా? అన్నది తెలియదు కానీ తాను మాత్రం ప్రజా ప్రతినిధిగా చట్టసభలలో అడుగుపెట్టడం ఖాయమన్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చార్జిషీట్ లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని దోషిగా పేర్కొన్నప్పటికీ ఎందుకు ఆయన్ని అరెస్టు చేయలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అవినాష్ రెడ్డికి  బెయిల్  వచ్చిందని అందుకే ఆయన్ని అరెస్టు చేయలేదన్న రఘు రామ కృష్ణంరాజు బెయిల్ ఎందుకు వచ్చిందంటే  అన్నయ్య దొరికేస్తారు కాబట్టి అంటూ సెటైర్ వేశారు.

Related posts

కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలి

Satyam NEWS

వృద్ధులను చిన్నపిల్లల్లా కాపాడుకోవాలి

Satyam NEWS

విద్యుత్ స్తంభం కూలి మూగజీవాలు బలి

Satyam NEWS

Leave a Comment