35.2 C
Hyderabad
April 27, 2024 14: 32 PM
Slider నల్గొండ

రైల్వే ప్రైవేట్ పరం చేయాలన్న యోచనను విరమించుకోవాలి

#Chityala Railway station

రైల్వే రంగాన్ని ప్రైవేటు పరం చేయాలనే యోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కె.వి.పి.యస్. జిల్లా ఉపాధ్యక్షులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. భారత రైల్వే శాఖ ప్రైవేటీకరణను నిరశిస్తూ  శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం, చిట్యాల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు వివిధ ప్రజా సంఘాలు, సీ.పీ యం నాయకుల ఆధ్వర్యంలో జరిపిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు లాభాలు ఘటిస్తూ లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో, కోట్ల మందికి రవాణా సౌకర్యాలు, జీవనోపాధి కల్పిస్తున్న ప్రజా రంగాన్ని అమ్మ జూపే ఆలోచనలు విరమించుకోవాలని కోరారు. రైల్వేనే కాకుండా విమాన యానం, టెలికాం, విద్యుత్, రక్షణ, బొగ్గు గనులు వంటి కీలకమైన రంగాలను కారుచౌక గా బీ.జే.పి.ప్రభుత్వం అమ్మజూపుతుందని  విమర్శించారు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇలాంటి చర్యలు చేపట్టడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీ. పీ.యం.  పార్టీ జిల్లా నాయకులు అవిశెట్టి శంకరయ్య,గీత సంఘం రాష్ట్ర నాయకులు పామనుగుల్ల అచ్చాలు, సీ.ఐ.టీ.యు.జిల్లా ఉపాధ్యక్షులు నారబోయ్న శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

ఇంకా, యు.టీ.ఎప్. జిల్లా నాయకులు మల్లేషం, అనిల్, రాజు, మహిళా సంఘం నాయకులు జిట్ట సరోజ, వ్య.కా.సం. నాయకులు గుడిసె లక్ష్మి నారాయణ, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దలు, రైతు సంఘం నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, జోగు లక్ష్మయ్య, పేర్వారం రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దుమ్ము, ధూళితో అనారోగ్యంపాల‌వుతున్నప్ర‌జ‌లు

Sub Editor

రెండు రోజులు వనపర్తి జిల్లాలో వ్యాక్సినేషన్ నిలిపివేత

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరో వేణు

Satyam NEWS

Leave a Comment