40.2 C
Hyderabad
May 5, 2024 18: 37 PM
Slider ప్రత్యేకం

ఫైనల్: ఫలించిన ముఖేష్ అంబానీ రాయ ‘బేరం’

mopidevi natwani

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్ధులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ స్థానాలు ఖరారు చేశారు. వీరితో బాటు తనకు అత్యంత నమ్మకస్తుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభ స్థానాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు.

నాలుగో స్థానంలో తన చెల్లెలు షర్మిలకు అవకాశం ఇస్తారని అందరూ భావించినా అందుకు భిన్నంగా ఆయన కొత్త అభ్యర్ధిని, రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని ఖరారు చేశారు. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని వచ్చి కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో సమావేశం సందర్భంగా ముఖేష్ అంబానీ ఒక ప్రతిపాదన ఆయన ముందు ఉంచారు.

పారిశ్రామికవేత్త ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అయిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ స్థానం కేటాయించాల్సిందిగా ముఖేష్ వై ఎస్ జగన్ ను కోరారు. తనకు మూడు రోజుల సమయం ఇస్తే ఆలోచించి చెబుతాన్న జగన్ ఈ మేరకు బాగా ఆలోచించి తన చెల్లెలుకు కాదని పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించారు.

Related posts

బాధిత కుటుంబానికి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ చెక్కు అందజేత

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీలో చేరిన బీహార్ కు చెందిన ముస్లిం కార్మికులు

Bhavani

తగ్గిస్తారా గద్దె దిగుతారా?: ప్రధాని పెడుతున్న వంటగ్యాస్ మంట

Satyam NEWS

Leave a Comment