26.7 C
Hyderabad
May 3, 2024 07: 20 AM
Slider ముఖ్యంశాలు

షట్టర్ డౌన్: త్వరలో మూతపడిపోతున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు

Lakshmi_VilasLaxmiVilasBank

ఎస్ బ్యాంక్ పతనం తర్వాత మరో బ్యాంకు పతనం దిశగా పయనిస్తున్నది. తమిళనాడు, ఇంకా దక్షిణాది రాష్ట్రాలలో బ్రాంచిలు కలిగి ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ పతనం అంచున ఉంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకును ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ ను ఎలాగైనా గట్టెక్కించాలని రిజర్వు బ్యాంకు ప్రయత్నాలు ప్రారంభించింది.

అయితే ఈ ప్రయత్నాలు ఆశావహంగా కనిపించడం లేదు. ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంకు బతకాలంటే దాదాపుగా రెండు వేల కోట్ల  రూపాయలు అవసరం అవుతాయి. రెండు వేల కోట్ల రూపాయలు ఎవరు పెట్టగలుగుతారనే వేటను రిజర్వుబ్యాంకు మొదలు పెట్టింది. లక్ష్మీ విలాస్ బ్యాంకును టేకోవర్ చేయాలని కొటక్ మహీంద్రా బ్యాంక్ ను రిజర్వు బ్యాంకు కోరుతున్నది.

రిజర్వు బ్యాంకు ఆఫర్ తెలుసుకున్న తర్వాత లక్ష్మీ విలాస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు డిబిఎస్ బ్యాంక్ ఇండియా, సింగపూర్ కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ టెమాస్క్, యూఎస్ బేస్డ్ టిల్డెన్ పార్క్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. టిల్డెన్ పార్క్ వారు ఎస్ బ్యాంకులో కూడా పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చారు కానీ ఎందుకో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందులో ఆసక్తి చూపలేదు.

Related posts

కేసీఆర్ గజ్వేల్ లో చెల్లని రూపాయి

Satyam NEWS

భూ నిర్వాసితుల గోడు పట్టించుకోని టిఆర్ఎస్ నేతలు

Satyam NEWS

తెలంగాణ లో ఇంటింటా నమో జ్యోతి కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment