29.7 C
Hyderabad
May 3, 2024 03: 45 AM
Slider గుంటూరు

మాజీ రేషన్ డీలర్ కు ఉచిత వైద్యం చేసిన చదలవాడ

#Dr.Chadalawada

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో అన్నవరం గ్రామానికి చెందిన మాజీ రేషన్ డీలర్, టిడిపి నాయకులు రాపూరి సాల్మన్ రాజుకు మంగళవారం నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డాllచదలవాడ అరవింద బాబు ఉచితముగా వైద్యం చేశారు.

ఆ గ్రామానికి చెందిన మాజీ రేషన్ డీలర్ సాల్మన్ రాజు గత కొద్ది నెలలుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. పేదకుటుంబమునకు చెందిన సాల్మన్ రాజు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన మండల టిడిపి నాయకులు పచ్చవ కోటేశ్వరరావు నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డాllచదలవాడ అరవింద బాబు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయమై స్పందించిన డాllఅరవింద బాబు నరసరావుపేట లో గల తన హాస్పిటల్ లో సాల్మన్ రాజుకు ఉచితంగా వైద్యపరీక్షలు, ఆపరేషన్ నిర్వహించి మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న తనకు ఉచితముగా ఆపరేషన్ చేసి మందులు ఇచ్చిన డాll అరవింద బాబుకు సాల్మన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.

మండల టిడిపి నాయకులు వెన్న బాల కోటి రెడ్డి, పచ్చవ కోటేశ్వరరావు, పులుకూరి జగ్గయ్య, తదితరులు డాllఅరవింద బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కోర్టు ఆర్డ‌ర్ ఉండ‌గానే విజ‌య‌న‌గ‌రం మంత్రి అనుయాయుల దందా….!

Satyam NEWS

నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయం

Satyam NEWS

అర్చకులకు 100% వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు

Satyam NEWS

Leave a Comment