29.7 C
Hyderabad
April 29, 2024 09: 13 AM
Slider కడప

నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయం

#medamallikarjunreddy

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని కొత్త బోయినపల్లి లో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం బాలబాలికలకు జగనన్న విద్యా కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తో పాటు మండల విద్యా శాఖాధికారి మేడా చంగల్ రెడ్డి తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. వారిని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృదం గజమాలతో శాలువాతో సత్కరించారు.

పలు చోట్ల పాఠశాలల విలీనం వలన ఆయా స్థానిక ప్రజలు పిల్లలని బడికి పంపాలంటే ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యని పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ పాఠశాల విలీన సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చి పరిష్కారం చేస్తామని అన్నారు. పేదవిద్యార్థులకు విద్యా కానుకలను,నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో  వైయస్సార్ సిపి పార్టీ సీనియర్ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి , శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ కొండూరు శరత్ కుమార్ రాజు , అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ చొప్పా ఎల్లారెడ్డి , జడ్పీటీసీ దాసరి పెంచలయ్య , ఎంపీటీసీ మధుగారు, బోయిన పల్లి సర్పంచి బోగా రాజా , కౌన్సిలర్ సుధాకర్, ఎం.ఈ.ఓ మేడా చెంగల్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు,స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

మంత్రికి రూ.126 కోట్లు, ఎమ్మెల్యేకు రూ.186 కోట్లు

Satyam NEWS

డ్రైనేజి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

Satyam NEWS

విశ్వాసంలో పోటీపడే కుక్కలు-గుంపుగా వచ్చే పందులు

Satyam NEWS

Leave a Comment