38.2 C
Hyderabad
May 1, 2024 20: 04 PM
Slider కడప

ఇసుక టిప్పర్లు అతివేగంతో తరచూ ప్రమాదాలు..

#kadapa dist

కడప జిల్లా నందలూరు మండలం కేంద్రంలో ఇసుక టిప్పర్ అతివేగం మూలంగా గురువారం రాత్రి అనర్ధం సంభవించింది. మండలంలోని ఆడపూరు లో ఇసుక క్వారీ ఇటీవల ఏర్పాటు చేశారు.

నిత్యం వందలాది వాహనాలు ఇసుక కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. ఈ ఇసుక క్వారీ కి మండలం కేంద్రం నుంచి జనాలు నిత్యం సంచరించే ప్రాంతంలో వెళ్ల వలసి వస్తోంది.

అయితే అవి జనావాసాల మధ్య నిదానంగా కాకుండా వేగంగా వెళుతున్నాయి. దీనితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలో గురువారం రాత్రి వేగంగా వెళుతున్న ఇసుక టిప్పర్ ను గ్రామస్తులు ఆపడానికి ప్రయత్నం చేయగా, ఆపకుండా ఇసుక టిప్పర్ ఇంకా వేగంగా వెళ్ళింది.

ఈ హడావుడి లో సమీపంలో ని రోడ్డు పక్కన ఉన్న ఆవుకు తగిలి నడుములు విరిగి పోగా,సమీఉల్లా ఖాన్ అనే యువకునికి రక్త గాయాలు అయ్యాయి.

పోలీసులు తగు చర్యలు తీసుకొని తిప్పర్ల అతివేగంకు కళ్లెం వేస్తే ప్రమాదాలు నిరోధించవచ్చు.

Related posts

‘జగనన్న సురక్ష’లో అధికారుల నిర్బంధం..

Satyam NEWS

Analysis: కరోనా కంగనా మధ్యలో శివసేన

Satyam NEWS

స్పెషల్: టీటీడీ ఈవోగా జె ఎస్ వి ప్రసాద్ కు గ్రీన్ సిగ్నల్?

Satyam NEWS

Leave a Comment