ఏరియేన్-5 రాకెట్ ద్వారా ఇస్రో రూపొందించిన జీశాట్-30 ఉపగ్రహాన్ని ఈనెల 17వ తేదీన అంతరిక్షంలోకి ప్రయోగించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనున్నది. జీశాట్-30ని కమ్యూనికేషన్ శాటిలైట్ గా రూపొందించారు.ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది.
జీశాట్ బరువు సుమారు 3357కిలోలు. ఐ-3కే ప్లాట్ఫామ్లో దీన్ని తయారు చేశారు. ఇన్శాట్-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 పనిచేయనున్నది. భారత్ తో పాటు అనుబంధ దేశాలకు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్లో సిగ్నల్ అందించనుండగా గల్ఫ్ దేశాలకు సీ బ్యాండ్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ ద్వారా సేవలు అందిస్తారు. ఈనెల 17వ తేదీన 2 గంటల 35 నిమిషాలకు ఈ శాటిలైట్ను నింగిలోకి పంపించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.