జగిత్యాల జిల్లాలో మంత్రులకు నిరసన సెగ తగిలింది. సాగునీటిని విడుదల చేయాలంటూ రాంసాగర్ ప్రాంత వాసులు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. హిమ్మత్ రావు పేట, తిమ్మాయిపేట, రాంగనర్ గ్రామాలకు సాగు,తాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. రోడ్డు బైఠాయించారు. అలాగే కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి ఏడాది దాటిపోయినా పరిహారం ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
previous post
next post