39.2 C
Hyderabad
May 4, 2024 20: 58 PM
Slider ముఖ్యంశాలు

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు గ‌ద్ద‌ర్ మ‌ద్ద‌తు

#Bhatti Vikramarka

సీఎల్పీ నేత, భ‌ట్టి విక్ర‌మార్క 104 రోజులుగా చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ మ‌రోసారి త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌కటించారు. తాజ‌గా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండ‌లం తిమ్మాపురం గ్రామంలో పాద‌యాత్ర చేస్తున్న భ‌ట్టి విక్ర‌మార్క‌తో క‌లిసి ఆయ‌న కూడా ముందుకు న‌డిచారు.

ఈ సంద‌ర్బంగా తిమ్మాపురం గ్రామంలో ఆయ‌న మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. వ్య‌క్తిగా, గ‌ద్ద‌ర్ ప్ర‌జాపార్టీని రిజిస్ట‌ర్ చేసిన త‌రువాత ఒక పార్టీగా మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర విజ‌య‌వంతం కావాలని ఆకాంక్షించారు.

ప్ర‌జ‌లంతా ఒక బలీయ‌మైన రాజ‌కీయ శ‌క్తిగా మారాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పిలుపిచ్చారు. ఈ పాద‌యాత్ర‌ను మ‌హ‌త్త‌మైన ఓట్ల శ‌క్తిగా మారుతుంద‌ని గ‌ద్ద‌ర్ ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ప‌దేళ్ల‌నుంచి సాగుతున్న నియంత‌ల పాల‌నకు గుణపాఠాలు ప్ర‌జ‌లంతా చెప్పాల‌ని అన్నారు. అంతేకాక రాష్ట్రంలోని ప్ర‌తి కాంగ్రెస్ నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క‌లా ప‌ల్లెల్లోకి వెళ్లాల‌న్నారు. అంతేకాక ఇంటింటికి వెళ్లి.. ప్ర‌తి ఇంటిని ఒక బూత్ గా మార్చాల‌ని అన్నారు.

ప్ర‌తి ఇంటిని ఒక ఓట్ల శ‌క్తిగా మార్చి.. నియంత‌ల పాల‌న‌కు ముగింపు ప‌ల‌కాల‌న్నారు. దేశంలో ఇప్పుడు 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య‌నున్న‌వారు 60 కోట్ల మంది ఉన్నారు.. వీరంతా గ‌త ప‌దేళ్లుగా సాగుతున్న పాల‌నపై ఒక మంచి నిర్ణ‌యం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లేయాల‌ని ఆయ‌న పిలుపిచ్చారు. 75 ఏళ్లున్న నేను కూడా భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌లో న‌డుస్తున్నాను. యువ‌త కూడా ఇలా స్వ‌చ్ఛందంగ ఆ ముందుకు వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొనాల‌ని ఆయ‌న పిలుపిచ్చారు.

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌జాయుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్ ప‌లు పాటాలు పాడారు. ఆయ‌న పాడిన పాట‌లు అక్క‌డున్న ప్ర‌జ‌ల్ని విశేషంగా అకట్టుకున్నాయి. గ‌ద్ద‌ర్ పాట‌ల‌తో ప్ర‌జ‌లు, మ‌హిళ‌లు పెద్ద ఎత్తున గొంతు క‌లిపారు. ఆయ‌న‌తో పాటు వారు కూడా పాట‌లు పాడుతూ భ‌ట్టి విక్ర‌మార్క‌కు మ‌ద్ద‌తు తెలిపారు. అంతేకాక మ‌హిళ‌ల‌తో క‌లిసి గ‌ద్ద‌ర్ పాట‌లు పాడుతూ.. కోలాట‌లు ఆడారు. ఈ సంద‌ర్భంగా గ‌ద్ద‌ర్ పాట‌ల‌కు.. విశేష‌మైన ప్ర‌జా స్పంద‌న వ‌చ్చింది.

Related posts

అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది

Satyam NEWS

హుజూర్ నగర్ లో నేత్రపర్వంగా శ్రీరామ కళ్యాణ వేడుక

Bhavani

ఉద్యోగులకు ఐఆర్ మరింత పెంచాలి

Satyam NEWS

Leave a Comment