29.7 C
Hyderabad
April 29, 2024 09: 19 AM
Slider జాతీయం

విపక్షాల కూటమి మూణ్ణాళ్ల ముచ్చటేనా

#political

పాట్నాలో ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశం జరిగి.. కనీసం మూడు రోజులు కూడా గడవక ముందే నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిపై కాంగ్రెస్… నేడు కాంగ్రెస్, సీపీఎం పార్టీలపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీన్ని బట్టి చూస్తే విపక్షాల కూటమి  లక్ష్యం మూణ్ణాళ్ల ముచ్చటేనా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విపక్షాల ఐక్యతపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ నేత అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మకెన్ ఆదివారం  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

విపక్షాల ఐక్యతను వేగవంతం చేసేలా కేజ్రీవాల్ ప్రకటనలు లేవని, విపక్ష ఐక్యతా యత్నాలను దెబ్బతీసి బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు. ఇదిలా వుండగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మహా కూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతుంటే.. బెంగాల్​లో మాత్రం కాంగ్రెస్,​ సీపీఎం.. బీజేపీకి వంతపాడుతున్నాయని​ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ  ఆరోపించడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్​లో కాంగ్రెస్​, సీపీఎం.. బీజేపీతో రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని మమత ధ్వజమెత్తారు. బెంగాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మమత  మూడు పార్టీల లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మమతా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

గత పది రోజుల్లో కాంగ్రెస్​, సీపీఎంపై మమతా బెనర్జీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. “మేము జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి కట్టేందుకు పయత్నాలు చేస్తున్నాం అన్నారు. పాట్నాలో ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశం జరిగి.. కనీసం మూడు రోజులు కూడా గడవక ముందే మమతా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. గత పది రోజుల్లో కాంగ్రెస్​, సీపీఎంపై మమతా బెనర్జీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. “మేము జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి కట్టేందుకు పయత్నాలు చేస్తున్నాం.

కానీ బంగాల్​లోని కాంగ్రెస్​, సీపీఎం మాత్రం.. బీజేపీతోనే పనిచేస్తున్నాయి. నేను ఈ అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాను” అని మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్​ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ​కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్​ రంజన్​ చౌదరి తోసిపుచ్చారు. బీజేపీపై పోరాటంలో మమత విశ్వసనీయత ఎప్పుడూ ప్రశ్నార్థకమేనన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇన్నేళ్లు మమతా చేసిన పోరాటం అందరికీ తెలుసన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే మార్గాలపై కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు ఉపన్యాసాలు ఇచ్చే చివరి వ్యక్తి బెనర్జీ అని సీపీఎం వ్యాఖ్యానించింది. మమతా బెనర్జీ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేత రాహుల్ సిన్హా కూడా కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్​, సీపీఎంతో తమకు ఎలాంటి అవగాహన ఒప్పందం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ మాత్రమే పోరాడుతోందన్నారు.

Related posts

కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Satyam NEWS

నారాయణరావుపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

Bhavani

దళిత జర్నలిస్టు లాకప్ హింస కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

Satyam NEWS

Leave a Comment