32.2 C
Hyderabad
May 13, 2024 20: 31 PM
Slider ముఖ్యంశాలు

చిరుత పులులు సంచ‌రించే ప్రాంతంలో సీఐ ప‌ర్య‌ట‌న‌….!

#gajapatinagaram

గ‌డ‌చిన కొద్ది రోజుల నుంచీ విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గ‌జ‌ప‌తిన‌గ‌రం స‌ర్కిల్ లో చిరుత‌పులి సంచిరిస్తోంద‌న్న వార్త‌ల‌తో ఆయా గ్రామ‌స్థులు భయంతో అల్లాడిపోతున్నారు. అదీగాక అట‌వీ శాఖ కు అందిన స‌మాచారంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు…ఆయా గ్రామాల‌లో తిరిగి..చిరుత పులి జాడ‌లు గుర్తించిడంతో ప‌ల్లె వాసులకు క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా ఇచ్చారు.

అయితే  ఇప్ప‌టికే ప‌ల్లెల్లో అటు ఎక్సైజ్, ఇటు అట‌వీ శాఖ అధికారులు వ‌చ్చి…పోలీసులు వ‌చ్చార‌నే న‌మ్మకంతో ఉంటూ వ‌స్తున్నారు.ఈ త‌రుణంలో  చిరుపులి సంచ‌రిచండంతో గ్రామ‌స్థుల‌కు ధైర్యం ఇచ్చేందుకు వారిలో భ‌యం పొగొట్టేందుకు  జిల్లా పోలీస్ సూపరెండెంటెండ్. దీపిక ..త‌న సిబ్బందికి సెట్ కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు.పులి సంచరించిన ప్రాంతాల‌కు వెళ్లి…ఆయా గ్రామ ప్ర‌జ‌ల‌కు అండ‌,ధైర్యం ఇచ్చిరావాల‌ని చెప్పారు. దీంతో గ‌జ‌ప‌తిన‌గ‌రం సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ ర‌మేష్…అర్ధ‌రాత్రి… మెంటాడ మండలం  బిరసాడవలస  సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు.  

చిరుతపులులు సంచరించిన ప్రాంతాల్లో ఆనవాళ్లు పరిశీలించి , ఆ ప్రాంతం గుండా వెల్లే పాదచారులుకు ,  వాహానదారులుకు  , సమీపంలో గల బిరసాడవలస గ్రామస్తులకు జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు సూచనలు ఇచ్చారు.పోలీసంటే చ‌ట్టాన్నిచూపించి భ‌యం పెట్ట‌డ‌మే కాదు..చ‌ట్టానికి లోబ‌డి న‌డుచుకోవాల‌ని చెప్ప‌డం కాదు..పోలీస్ అంటే ఓ ధైర్యం అని చెబుతో్ంది స‌త్యం న్యూస్.నెట్

Related posts

మున్సిపల్ కార్మికుల పై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ

Satyam NEWS

జాతీయ జెండా విషయంలో పొరబాట్లు చేయవద్దు

Satyam NEWS

పాదయాత్రతో తిరుమల చేరుకున్న బైరెడ్డి వెంకటరెడ్డి బృందం

Satyam NEWS

Leave a Comment