27.7 C
Hyderabad
April 30, 2024 09: 34 AM
Slider మెదక్

జాతీయ జెండా విషయంలో పొరబాట్లు చేయవద్దు

#nationalflag

జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా వస్తుంటాయి. ఒక్కొక్కసారి చట్ట ప్రకారం శిక్షార్హం కూడా అవుతుంది. అందుకే జెండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

జాతీయ జెండా ఎగురవేయడానికి సంబంధించి 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన నియమాలు ఇలా వున్నాయి. అజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత దేశం స్వాతంత్రం సంపాదించుకుని 75 సంవత్సరాలు పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఏ సందర్భంలో ఎగుర వేయాలి అనే అంశాలను నేషనల్ హానర్ ఆక్ట్ 1971 లో స్పష్టంగా జెండాను ఏ రకంగా ఎగురవేయాలి ఏ సైజ్ లో ఉండాలి ఏ రంగులో ఉండాలి వివరాలను తెలియచేశారు.

అలాగే దీనికి కొన్ని సవరణలు చేస్తూ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ని కూడా తీసుకురావడం జరిగిందని మెదక్ జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు. అలాగే ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగ‌ర‌వేయాల‌ని (Har Ghar Tiranga) కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 11 నుంచి 17 వరకు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగ‌ర‌వేయాలని, ఈ నేప‌థ్యంలో ఫ్లాగ్ కోడ్‌ను ప్రభుత్వం మార్చిందని అన్నారు.

త్రివర్ణ పతాక నియమాలు, నిషేధించబడిన అంశాలు

1. జెండాపై ఏదైనా రాయడం, తయారు చేయడం లేదా తొలగించడం చట్టవిరుద్ధం.

2. త్రివర్ణ పతాకాన్ని ఏ వాహనం వెనుక, విమానంలో లేదా ఓడలో పెట్టకూడదు

3. ఇది ఏ వస్తువులు, భవనాలు మొదలైనవాటిని కవర్ చేయడానికి ఉపయోగించకూడదు

4. ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ జెండా నేలను తాకకూడదు.

5. త్రివర్ణ పతాకాన్ని ఏ విధమైన యూనిఫాం లేదా అలంకరణ కోసం ఉపయోగించకూడదు.

6. జాతీయ జెండా చేనేత ఖాది, కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి.

7. జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300×4200 మి.మీ. నుండి 150×100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది.

8. ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు.

9. పై నుండి క్రిందకు 3 రంగులు సమానంగా ఉండాలి.(నారింజ,తెలుపు,ఆకుపచ్చ)

10. జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు.

11. జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు.

12. జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి. కిందికి వంచకూడదు.

13. జెండాను నిదనంగా(నేమ్మదిగా) ఎగురవేయాలి.

14. జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి.

 15. జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం. ఎక్కడపడితే అక్కడ పడ వేయరాదు.

16. ఒకవేళ వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వచ్చినట్లయితే జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి.

17. జెండాను ముందుగా 1, 2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు.

18. భావి భారత పౌరులను తీర్చిదిద్ధాల్సిన మనం జెండా వందనాన్నీ నియమ నిష్టలతో, నిబద్ధతతో, నియమాలతో చేయాలి. 19. జెండా పోల్ నిటారుగా ఉండాలి. వంకరగా ఉండరాదు. కొన్ని సార్లు విరిగిన సందర్భాలు జరిగాయి. ఇలాంటివాటి పట్ల జాగ్రత్త వహించాలి.

20. జేబులకు ఉంచే చిన్న జెండాలు ఎక్కడబడితే అక్కడ పడ వేయనీయరాదు. వాటిని తొక్కనీయరాదు. పిల్లలకు తప్పని సరిగా జెండా నియమాలు చెప్పి పాటింపజేయాలి. జాతీయ గేయం పాడే సమయంలో పాటించే నియమాలు చెప్పాలి.

21. డిజైన్ కోసమని.. తాళ్లకు త్రివర్ణ పతాకాలను అతికించరాదు. రంగు రంగు కాగితాలను మాత్రమే అతికించాలి. చాలా మంది రెడీమేడ్ ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాలు కడుతున్నారు. వాటిని కూడా వాడరాదు

జాతీయ పతాకానికి గౌరవ భంగంకలగకుండా చూసుకోవాల్సిన బాద్యత ప్రతి భారతీయ పౌరుడికి ఉన్నదని, అజాదికా అమృత్ మహోత్సవ్  పై విషయాలను గమనించి అందరూ ఆ విదంగా నడుచుకోవాలని మెదక్ జిల్లా అన్నారు.

Related posts

ఓ వైపు వలంటీర్లకు సేవాపతకాలు..మరోవైపు ఆ వలంటీర్లే రోడ్లపై త్రిబుల్ డ్రైవింగ్..!

Satyam NEWS

మన సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక

Satyam NEWS

దుబ్బాక విజయంతో తడాఖా చూపించిన బిజెపి

Satyam NEWS

Leave a Comment