నూతనంగా గాజువాక ట్రాఫిక్ సీఐగా పి.కోటేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు, ది జాతీయ కన్జ్యూమర్ రైట్స్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ ఎం వి ఎస్ జి తిలక్ కలిసి పుష్ప గుచ్చాలు అందజేసి శాలువాతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ కోటీశ్వరరావు ఏ స్టేషన్లో విధులు నిర్వహించిన అంకితభావంతో పని చేసి అక్కడ ప్రజల మన్నల్ని పొందుతారని కొనియాడారు. గాజువాకలో ఇటీవల ట్రాఫిక్ సమస్యలు అధికమయ్యాయని దీని అధిగమించడానికి కోటేశ్వరరావు సేవలు అవసరమని అన్నారు. విశాఖపట్నం ఛైర్పర్సన్ టీ ఎన్ సి ఆర్ సి అర్చన,బదిలీ అయిన సిఐ ఆర్ సి ఎన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మంగరాజురెడ్డి పాల్గొన్నారు.
previous post