28.7 C
Hyderabad
May 5, 2024 09: 58 AM
Slider ఆధ్యాత్మికం

ఉత్త‌రాంధ్ర పండుగ‌కు విజ‌య‌న‌గ‌రంలో అంకురార్ప‌ణ‌….!

#paiditalliammavaru

అందరి సమన్వయం, సహాయ సహకారాలతో  పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు నిర్వహించనున్నామని , ఇందుకు సంబంధించి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు  చేయనున్నామని నగర మేయర్  వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్  కోలగట్ల శ్రావణి తెలిపారు.

ఉత్తరాంధ్ర ఇలవేల్పు  పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించి పందిరి రాట కార్యక్రమంకు అంకురార్పణ చేశారు. ముందుగా వీరు అమ్మవారి ఆలయంలో తల్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైడితల్లి పండుగ అంటే నెలరోజుల పండుగ అని, ఈరోజు పందిరి రాట కార్యక్రమం తో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

అక్టోబర్లో జరిగే  తోల్లెల ఉత్సవం, సినిమానోత్సవం, తెప్పోత్సవం, ఉయ్యాల కంబాల, చండీ హోమం తో ఉత్సవాలు ముగియ నున్నాయని తెలిపారు. ఎక్కడా జరగని రీతిలో రెండున్నర శతాబ్దాలకు పైగా అప్రతిహతంగా సాగుతున్న పైడితల్లిమ్మ పండుగ ప్రతి ఏటా కూడా శోభా య మానంగా జరుగుతోందని అన్నారు.

పైడితల్లి సిరి మానోత్సవం అంటే కేవలం ఉత్తరాంధ్ర కే పరిమితం కాకుండా ఒరిస్సా, చతిస్గడ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారని అన్నారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా నగరపాలక సంస్థ తరఫున ఎప్పటిలాగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇలా అందరి సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ తరుపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ఈసరపు రేవతి దేవి, స్థానిక కార్పొరేటర్ ఎవర్న విజయలక్ష్మి,  ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి కిషోర్ కుమార్, మాజీ శాసన మండలి సభ్యులు గాదె శ్రీనివాసులు  నాయుడు,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు ఎవర్న కుమారస్వామి, బాల బ్రహ్మారెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు వెచ్చ శ్రీనివాసరావు, పతివాడ వెంకటరావు, తాడి సురేష్, బలివాడ పార్వతి, శ్రీమతి చిళ్ళ పుష్ప,  గొర్లె ఉమ, నక్క జ్యోతి, గంధం లావణ్య, రామ్ సింగ్ సూరమ్మ, పార్టీ నాయకులు పూసర్ల  అప్పారావు, గొర్లె దేవదాస్, బలివాడ కాశి, గంధం హరిబాబు, చిల్లా  వాసు, లతోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Related posts

క్రీడారంగంలో ప్రభుత్వ సదుపాయాలు ఉపయోగించుకోవాలి

Satyam NEWS

కాపీ క్యాట్: 2 వేల నోటుపై సెక్యూరిటీ ఫీచర్లు డొల్లే

Satyam NEWS

ప్రపంచంలోనే అతి పెద్ద అమేజాన్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment