42.2 C
Hyderabad
April 26, 2024 15: 09 PM
Slider ఆధ్యాత్మికం

వటపత్రసాయి అలంకారంలో ఒంటిమిట్ట కోదండరాముడు

#kodandarama

కడపజిల్లా ఒంటిమిట్టలో మూడవరోజు శుక్రవారం కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వటపత్ర సాయి అలంకారంలో రామయ్య కటాక్షం కల్పించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు.

పురాణాలు చెప్తున్న ప్రకారం ..

జలప్రళయం సంభవించినప్పుడు మహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ శిశువుగా రామయ్య దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోతిలో పెట్టుకొని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ మహా విష్ణువు అవతారమైన రాముడు భక్తులకు కనువిందు చేశారు.

భక్తుల కష్టాలను తీర్చేందుకు ఎప్పుడూ ముందుంటుందని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటపత్ర సాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో చక్కగా వర్ణించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మురళిధర్, ఇన్ స్పెక్టర్ ధనుంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

రిలయన్స్‌ జియోకు ట్రిబ్యునల్‌లో కొంత ఊరట

Satyam NEWS

చెట్టుకు ఊరేసుకొని గీత కార్మికుడు మృతి

Bhavani

వనపర్తిలో వైన్ షాపు తరలింపునకు అధికారుల హామీ

Satyam NEWS

Leave a Comment