29.7 C
Hyderabad
May 2, 2024 03: 53 AM
Slider నల్గొండ

గంజాయి విక్రయదారులపై పి.డి. యాక్ట్ నమోదు చేస్తాం

#SPRanganath

నల్లగొండ జిల్లాలో గంజాయి విక్రయాలు, సరఫరా చేస్తున్న వ్యక్తుల విషయంలో నిఘాను మరింత పటిష్టం చేశామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా గంజాయి విక్రయాలు, రవాణా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రజలు నేరుగా తనకు 9440795600 ద్వారా, సంబంధిత పోలీస్ స్టేషన్లకు మెసేజ్ రూపంలో, వాట్స్ అప్ ద్వారా కానీ డయల్ 100 ద్వారా కానీ సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి రవాణా,  విక్రయదారులు, సరఫరా చేస్తున్న వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నామన్నారు.

జిల్లాలోని జాతీయ రహదారులపై అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేయడం ద్వారా గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.

అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘాను పెంచడం ద్వారా జిల్లాలో గంజాయిని అరికట్టడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని డిఐజి రంగనాథ్ తెలిపారు.

ప్రజలంతా తమతో సహకరించి గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని ఆయన సూచించారు.

Related posts

నితీష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పీకే

Satyam NEWS

బీజేపీ నేతలతో పవన్ వరుస భేటీలు

Bhavani

సంబంధిత పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment