33.2 C
Hyderabad
May 3, 2024 23: 44 PM
Slider వరంగల్

విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

#MuluguTeachers

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.

ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ ఉపాధ్యాయుల ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరు రోడ్డు మీదికి వచ్చి ఉద్యమాలు చెయ్యరని కేసీఆర్ అన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఉపాధ్యాయుల తో సహా అందరూ రోడ్డు మీదికి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు నిరసనలు తెలియజేస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలు విపరీతంగా పెరిగాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు విద్యారంగం కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టారు విద్య అందని ద్రాక్షగా తయారైంది అంగట్లో సరుకు లాగా విద్యారంగాన్ని అమ్మేస్తున్నారు అని అన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు ఇంతవరకు పరిష్కరించలేదు అప్ గ్రేడెడ్ పండిట్, పి ఈ టి లతో సహా అన్ని కేటగిరీల పదోన్నతులు కల్పించాలి పదోన్నతులతో పాటు సాధారణ బదిలీలు నిర్వహించాలి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు కల్పించాలి అంతర్రాష్ట్ర అంతర్జిల్లా బదిలీలు నిర్వహించాలి అని ఆయన కోరారు.

పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి నిరుద్యోగ భృతి ఇవ్వాలి కెసిఆర్ హామీ నిలబెట్టుకోవాలి అని ఆయన కోరారు.

రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి అని ములుగు జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల  భిక్షపతి గౌడ్ ఈ రోజు ఉపాధ్యాయ దీక్షలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Related posts

అంబర్ పేట్ డివిజన్ లో ఎమ్మెల్యే పాదయాత్ర

Satyam NEWS

“స్పందన”కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా….!

Satyam NEWS

బివేర్: ఐఐటీ -జేఈఈ కొత్త సంస్థలను నమ్మ వద్దు

Satyam NEWS

Leave a Comment