30.7 C
Hyderabad
April 29, 2024 06: 56 AM
Slider విజయనగరం

విజయనగరం వన్ టౌన్ పోలీసుల అదుపు లో గంజాయి వాడకందార్లు

ఇటీవలే కొద్ది నెలల క్రితం ఏపీలో ని విశాఖ జిల్లా సమీపంలో అరకు-బొడ్డవర 350 కేజీల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన గంజాయి… ఒడిశా రాష్ట్రం నుంచీ సరఫరా అవుతోందని పోలీసుర విచారణ లో తేలింది. బొడ్డవర వద్ద దొరికిన గంజాయి… విజయనగరం జిల్లా లో పంపిణీ అవుతోందని తెలుసుకున్న పోలీసులు… అక్రమంగా రవాణా అవుతున్న దాని పై దృష్టి పెట్టారు.ఇటీవలే జిల్లా ఎస్పీ ఆధీనంలో ఉన్న ఐడీ పార్టీ.. ఎస్.బీ బృందాలకు అందిన సమాచారం తో…నగరంలో వన్ టౌన్, టూటౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలో రాత్రి డ్యూటీ లు అలాగే సాయంత్రం పూట విజువల్ పోలీసింగ్ లో వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో.. అయ్యన్న పేట ,కామాక్షి నగర్ దుప్పాడ పరిసరాలను జల్లెడ పట్టిన ఐడీ పార్టీ బృందం… ఆరుగురిని వన్ టౌన్ స్టేషన్ కు తీసుకువచ్చారు. క్రైమ్ ఎస్.ఐ అశోక్ మరో ఎస్ ఐ భాస్కర్ లు…ఆ గంజాయి కి అలవాటు పడ్డ యువకుల కన్నవారి ని స్టేషన్ కు పిలిపించి… సీఐ డా.వెంకటరావు సమక్షంలో ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో.. .సీఐ డా.వెంకటరావు… కుర్రాళ్ళ ముందే కన్నవారిని హెచ్చరించారు. ఒక యువకుడు తల్లి కన్నీరు మున్నీరై…ఈ సారికి మా బాబు ను వదిలేయండి.. నేను మందలిస్తానని వాపోయింది.

పనిలో పనిగా. ఓ ప్రభుత్వ టీచర్ కొడుకు ను కూడా పోలీసులు స్టేషన్ కు తీసుకు రావడంతో… మర్యాద గా వృత్తి లో ఉన్న మాస్టర్ ను దృష్టిలో పెట్టుకుని వార్నింగ్ ఇచ్చి… ఇంటికి పంపించారు… సీఐ.ఇలా మిగిలిన ఆరుగురికి…పోలీసులు వార్నింగ్ ఇచ్చి…కన్నవాళ్లను పిలిపించి….హెచ్చరించి పంపించారు. ఈ సందర్భంగా సీఐ డా.వెంకటరావు…”సత్యం న్యూస్. నెట్”తో మాట్లాడుతూ… ఎస్పీ ఆదేశాలతో..ఈ నెల అంతా…గంజాయి పై దృష్టి సారిస్తామని…బయటకు వెళ్లే యువకులు.. యువతిల పట్ల కన్నవాళ్లు…జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Related posts

అయోధ్యలో పెద్ద ఎత్తున హోటళ్లు పెడుతున్న OYO

Satyam NEWS

విషాదం: అనారోగ్యంతో సినీ నటి మీనా భర్త మృతి

Satyam NEWS

దళిత గిరిజన సంక్షేమంపై జగన్ రెడ్డి చెప్పేవన్నీ కాకిలెక్కలు

Bhavani

Leave a Comment