38.2 C
Hyderabad
April 27, 2024 16: 16 PM
Slider ప్రత్యేకం

కారంపల్లెకు అల్లుడు కాబోతున్న స్కాట్లాండ్ యువకుడు

ఆ ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డు రాలేదు… రెండు అక్షరాల ప్రేమ ఎంతో స్వచ్ఛమైంది…నలుపు తెలుపు అన్న వర్ణ వివక్షత అసలే లేదు… కులం గోత్రం అన్న పట్టింపేలేదు… ఎల్లలు దాటిన ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఉమ్మడి కడప జిల్లా రాజంపేట మండలం కారం పల్లెకు రావాల్సిందే. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కారంపల్లి గ్రామానికి చెందిన కారంపల్లి సుబ్బారెడ్డి కుమార్తె నీమకల్లు కౌసల్యా రెడ్డి చాలా సంవత్సరాలు క్రితం యుూకేలో స్థిరపడిపోయింది. ఆమె కుమార్తె నీమకల్లు సోనియా రెడ్డి యూకే లోనే విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి జనరల్ మెడిసిన్‎లో విశేష ప్రతిభ కనబరిచింది.

చదువుకునే సమయంలోనే మ్యాత్యుస్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ లో ఉన్నత విద్యను అభ్యసించి వ్యాపారం చేస్తున్నారు. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరువురి పెద్దలు అంగీకరించారు. వచ్చే నెల 7వ తేదీన వీరికి వివాహం జరగనుంది. వీరి పెళ్లికి హైదరాబాద్ వేదిక కానుంది. వివాహానికి ఇరు కుటుంబాలు కారంపల్లి‎కి చేరుకోవడంతో అక్కడ సందడి వాతవరణం నెలకొంది. విదేశీయులతో స్థానికులు ముచ్చటించడం, వారితో మమేకం అవడం, ఆప్యాయంగా గ్రామస్తులతో వారు ముచ్చటించడం చూపరులను ఆకట్టుకుంది.

Related posts

టి 24 టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ

Bhavani

సుస్థిరమైన సుపరిపాలన అందిస్తున్నాం

Bhavani

క్రీడలతో శారీరిక దారుడ్యాన్ని పెంపొందించుకోవాలి

Satyam NEWS

Leave a Comment