Slider ఖమ్మం

బలవంతపు భూ సేకరణ తగదు

#CPI

హైవేల నిర్మాణానికి సంబంధించి బలవంతపు భూ సేకరణ తగదని ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హెచ్చరించారు. రెండు కోట్ల రూపాయల విలువైన భూములకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వడం ఏ మేరకు సమాంజసమని ప్రసాద్ ప్రశ్నించారు. చింతకాని మండలంలోని వందనం, కొడుమూరు రైతులతో కలిసి హైవేలో కోల్పోతున్న భూములను పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్లలు, రెవెన్యూ సిబ్బంది, రైతులే లేకుండా సర్వే చేయడం దుర్మార్గమైన చర్య అని దీనిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రైతులకు పరిహారం కింద ఎకరానికి కోటి రూపాయలు మంజూరు చేయాలని అమరావతి- నాగపూర్ హైవే రోడ్డుకు అనుసంధానంగా సర్వీసు రోడ్లను నిర్మించాలని భవిష్యత్తులో పొలాల మధ్య నీటి పారుదలకు సంబంధించి సౌకర్యాలు కల్పించాలని రైతులకు ఇబ్బందులు కలుగకుండా అండర్ బ్రిడ్జిల నిర్మాణం: చేపట్టాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి పావులూరి మల్లికార్జున్, జిల్లా సమితి సభ్యులు కూచిపూడి రవి, మండల నాయకులు నక్కనబోయిన కృష్ణ, నారపోగు నాగార్జున, కొల్లి సీతయ్య, కొల్లి గోవిందరావు, వేముల సతీష్, నారపోగు శ్రీను, వీరబాబు, కొండలు, సతీష్, కోటయ్య, బిఆర్ఎస్ నాయకులు పెంట్యాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు పెంట్యాల అప్పారావు, సిపిఎం నాయకులు కూచిపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS

భూ ఆక్ర‌మ‌ణ‌లపై అధికారుల చోద్యం

Sub Editor

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

Satyam NEWS

Leave a Comment