23.2 C
Hyderabad
May 7, 2024 20: 01 PM
Slider రంగారెడ్డి

గిఫ్ట్ టు కేసీఆర్: దాదాపు 500 ల మొక్కలు నాటిన కేబి స్కూల్

gift to kcr

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి  సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు తుర్కయాంజల్ KB స్కూల్ ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు. దాదాపు 500 మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫిలిం ఇండస్ట్రీ చైర్మన్ రామ్మోహన్ రావ్,  రాచకొండ డిసిపి దివ్యచరన్ రావ్, గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవేందర్, సినిమా ఆర్టిస్ట్ నందకిశోర్, స్కూల్ ఛైర్మన్ సి ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు మారిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టి లో ఉంచుకొని ప్రతి ఒక్కరం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని, భవిష్యత్ బావితరాలైన విద్యార్థులకు మొక్కలు పెంచే ప్రాధాన్యతను వివరించాలని పెద్దలు గా మనం భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడమే గొప్ప సంపద అని తెలిపారు.

 ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి kcr జన్మదినం ను పురస్కరించుకుని ఎలాంటి వృధా ఖర్చులు, అంగు ఆర్బాటలు లేకుండా మొక్కలు నాటాలని రాజ్య సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు స్కూల్ ఆవరణలో మొక్కలు నాటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్, జగన్ మోహన్ గౌడ్, స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ రెడ్డి , MPTC  ఏనుగు భరత్ రెడ్డి, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫర్ సేల్: కామారెడ్డి కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి

Satyam NEWS

కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

నడిపల్లి గ్రామంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Bhavani

Leave a Comment