35.2 C
Hyderabad
April 27, 2024 14: 04 PM
Slider పశ్చిమగోదావరి

నడిపల్లి గ్రామంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

#Sand mafia

ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామం లో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, తమ్మిలేరు నదిని ఆనుకుని ఉన్న పంట పొలాలను కూడా వదల డం లేదని ఆ గ్రామ రైతులు స్పందన ద్వారా జిల్లా కలెక్టర్ ని ఆశ్రయించారు.

తమ్మిలేరులో ఇసుక తవ్వడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పంటలకు నీరందని పరిస్థితి వల్ల 2005 లో అప్పటి ప్రభుత్వం భూగర్భజలాల పరిరక్షించ దానికి వాల్టా చట్టాన్ని అమలు చేసిందని నడిపల్లి రైతులు కలెక్టర్ కి స్పందన

ద్వారా ఇచ్చిన ఫిర్యాదులో ఉటంకించారు. అసలు నడిపల్లి గ్రామం లో గ్రామ సచివాలయ వ్యవస్థ ఉందా ఉంటే గ్రామ కార్యదర్శి, గ్రామ రెవిన్యూ అధికారి, ప్రభుత్వ నిబంధన ల ఉల్లంఘన, ఇసుక అక్రమ తరలింపు, శాంతి భద్రతల పరిరక్షణ

వంటి అంశాలపై స్పందించే అధికారులున్నారా అనే అనుమానాలు ఆ గ్రామప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామం లో ఇసుక మాఫియా కు చట్టం న్యాయం, ధర్మం చుట్టాలయ్యాయా అని ఇసుక మాఫియాను అడ్డుకునే అధికారులే లేరా

అంటూ తమ్మిలేరు నదీ ప్రవాహక పరిధిలో నది ఒడ్డున పంట పొలాలో అక్రమ ఇసుక తవ్వుతున్న మాఫియా ని అడ్డుకుని మా పంట పొలాలను పరిరక్షించాలని నడిపల్లి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, మైనింగ్, రెవిన్యూ, పెదవేగి మండల

తహసీల్దార్, మండల పరిషత్ అధికారిని కోరుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులను బే ఖాతరు చేస్తూ జగనన్న ఇళ్లకు ఇసుక సరఫరా ముసుగులో తమ్మిలేరు తో పాటు ఇసుక నేతలు వేసిన రైతుల పొలాలను కూడా సుమారు 20

మీటర్ల లో తు వరకు తవ్వి ఇసుక క్వారీలుగా పంట పొలాలను మార్చేస్తున్నారని నడిపల్లి గ్రామ రైతులు ఆవేదన తో స్పందలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

Related posts

మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘ నేతలు

Satyam NEWS

క్రొత్తగా డిగ్రీ గురుకుల కళాశాలలు ప్రారంభించాలి

Satyam NEWS

పేదవారికి కూడా ఉత్తమమైన విద్య

Bhavani

Leave a Comment