కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సైతం టికెట్ల లొల్లి బహిర్గతమైంది. ఆ పార్టీ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కన్నయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఆయన సోదరుడు నయీమ్, జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావులు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
పార్టీకోసం నిరంతరం కృషి చేసిన కార్యకర్తలను వదిలి డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడానికి షబ్బీర్ అలీ, ఆయన సోదరుడు నయీంలే కారణమని ఆరోపించారు. కామారెడ్డిలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. హిందు, ముస్లింల వారిగా టికెట్ల పంపిణీ చేపట్టారని ఆరోపించారు. రాయలేని భాషలో బూతు పురాణం అందుకున్నారు.
ఈ రెండు పార్టీల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత షబ్బీర్ ఆలీపై యివజన కాంగ్రెస్ నాయకుడు కన్నయ్య చేసిన ఆరోపణలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల భవిష్యత్ ఏంటని ఇప్పుడు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు నామినేషన్ ఉపసంహరణకు సమయం ఉన్నా తనను లోపలికి రానియలేదంటూ ఓ అభ్యర్థి తన ఆవేదన వెలిబుచ్చారు. కార్యాలయం వద్ద బీజేపీ నాయకుల ఆందోళన సమయంలో డోర్ మూసివేయడంతో అక్కడే ఉన్నానని, డోర్ తీసి వచ్చేసరికి సమయం ముగిసిందని పంపించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. చివరికి చేసేదేమీ లేక వెనుదిరిగాడు.