28.7 C
Hyderabad
May 5, 2024 10: 56 AM
Slider ఖమ్మం

రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వండి

give better compensation to farmers

*మంత్రి , అధికారులకు తుమ్మల ఫోన్

*ఎపి కంటే మెరుగైన పరిహారం ఇస్తామని హామీ

గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యానవన పంటభూములు పోగొట్టుకున్న  రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు . ఈ మేరకు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి , వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు లకు ఫోన్ చేసి రైతుల పరిస్తితి ని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా రైతులు ఎంతో విలువైన భూములను,ముప్పై సంవత్సరాలపాటు దిగుబడినిచ్చే పామాయిల్ తోటలను కోల్పోయారని వివరించారు. అంతే కాకుండా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోపామాయిల్ మొక్కలను కోల్పోయిన రైతులకు ఒక్కో మొక్కకు 6.233 రూపాయలు నష్ట పరిహారం చెల్లిస్తున్నారని కానీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొక్కకు 1.282 రూపాయలు మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తుందని, దీనివలన రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని కాబట్టి తెలంగాణా ఉద్యానవన శాఖ అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ స్ధాయి పరిహారాన్ని నిర్ణయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం వివరాలు,ఉత్తర్వులు కాపీలను కమీషనర్ కు పంపించారు. ఆ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని రైతులకు న్యాయం చేయాలని మాజీమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు  కోరారు.

దీనిపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి , కమిషనర్  రఘునందన్ రావు లు  ఆంధ్రప్రదేశ్ రాష్రం ఇచ్చే పరిహారం కన్నా ఎక్కువ పరిహారం చెల్లిస్తామని రెండు, మూడు రోజుల్లో దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts

గంజాయి సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదు

Satyam NEWS

సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ.25 కోట్ల హెరాయిన్‌ సీజ్

Sub Editor

కోవిడ్ నిబంధనలు సచివాలయానికి వర్తించవా?

Satyam NEWS

Leave a Comment