32.2 C
Hyderabad
May 9, 2024 14: 04 PM
Slider రంగారెడ్డి

డాక్టర్ మార్తినేని ప్రియాంక కు గ్లోబల్ చేంజ్ మేకర్ అవార్డ్

#priyanka

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లోని హెచ్ బీ కాలనీ చెందిన ప్రియా స్మైల్ డెంటల్ క్లినిక్ అధినేత డాక్టర్ మార్తినేని ప్రియాంక ను ‘గ్లోబల్ ఛేంజ్ మేకర్ పురస్కారం వరించింది. స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఇండిపెండెన్స్ ఇంటర్నేషనల్ యూత్ డే సంబరాల లో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న అవార్డ్ ల ప్రదానోత్సవంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన డాక్టర్ మార్తినేని  ప్రియాంకకు గ్లోబల్ చేంజ్ మేకర్ అవార్డు ను స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్  అందజేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశ్వ విద్యాలయం ఎన్ టీ ఆర్ ఆడిటోరియం లో నిర్వహించారు. ఈ అవార్డ్ ను తీసుకున్న సంధర్భంగా బంధు, మిత్రులు, శ్రేయోభిలాషులు డాక్టర్ మార్తినేని ప్రియాంకకి శుభాభి వందనములు తెలిపారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

పవన్ కల్యాణ్ ఒక తెగిపోయిన గాలిపటం

Satyam NEWS

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా  పుట్ట పాక మహేష్   

Satyam NEWS

ఆందోళనల నేపథ్యంలో అసెంబ్లీకి అడ్డదారి

Satyam NEWS

Leave a Comment