31.2 C
Hyderabad
February 11, 2025 20: 55 PM
Slider ముఖ్యంశాలు

జెట్ స్పీడ్ గోల్డ్: 4 రోజుల్లో వెయ్యి రూపాయలు జెంప్

gold rate

భారత్ లో బంగారం ధర రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ఎంసీఎక్స్‌‌లో గోల్డ్ ఫ్యూచర్ ధర 10 గ్రాములకు 0.11 శాతం పెరిగి రూ.38,926గా ఉంది. ఇలా పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. ఈ నాలుగు రోజుల్లో గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1000 పెరిగింది.

సిల్వర్ ధర మాత్రం కాస్త తగ్గింది. ఎంసీఎక్స్‌‌లో సిల్వర్ ఫ్యూచర్ ధర కేజీకి 0.2 శాతం తగ్గి రూ.46,740గా ఉంది. గత మూడు రోజుల్లో మాత్రం సిల్వర్ ధర కేజికి రూ.1,700 పెరిగింది. గ్లోబల్‌‌గా స్పాట్ గోల్డ్ ధర 0.1 శాతం తగ్గి ఔన్స్‌‌కు 1,509.56 డాలర్లుగా ఉంది. సిల్వర్‌‌‌‌ ఒక ఔన్స్‌‌కు 17.88 డాలర్లుగా రికార్డైంది.

అమెరికా–చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో, ఈ ఏడాది ప్రారంభం నుంచి గోల్డ్ ధరలు 18 శాతం పెరిగాయి. విచిత్రం ఏమిటంటే ప్రపంచంలోని చాలా దేశాలలో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి.

Related posts

కొత్త దిశ చూపించేందుకు కాంగ్రెస్ చింతన్ శివిర్

Satyam NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కొత్త చరిత్ర

Satyam NEWS

గండికోట ముంపు నిర్వాసితుల అరెస్టుకు రంగం సిద్ధం

Satyam NEWS

Leave a Comment