28.2 C
Hyderabad
June 14, 2025 11: 07 AM
Slider కరీంనగర్

ట్రాజెడీ: ఈ చిట్టితల్లి పుట్టిన రోజే ఆఖరి రోజు

naveena

సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్‌కు చెందిన నవీన(20) వరంగల్‌ కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు కావడంతో గురువారం ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పొలం పనుల్లో తండ్రికి సహాయ పడేందుకు వెళ్లింది.

వరినారు చేరవేసేందుకు నవీన ట్రాక్టర్‌ వెనుక భాగంలో ఉన్న రోటవేటర్‌పై నారు వేసుకొని ట్రాక్టర్‌ నడుపుకుంటూ పొలం ఒడ్డు వద్దకు చేరుకుంది. ఒడ్డుపై ఉన్న ట్రాక్టర్‌ను కొంత వెనుకకు తీసుకురావాలని తండ్రి కోరగా, ఒక్కసారిగా ట్రాక్టర్‌ పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. నవీనపై ట్రాక్టర్‌ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందింది.

Related posts

జగన్ గారూ, ఉద్యోగుల ఆశీర్వాదం తీసుకోండి…శాపం కాదు

Satyam NEWS

అమెరికా నిర్వాకం వల్లే ఉక్రెయిన్ రష్యా యుద్ధం

Satyam NEWS

సోదరా నువ్వు భ్రమల్లో బాటుకుతున్నావు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!