40.2 C
Hyderabad
May 2, 2024 15: 50 PM
Slider జాతీయం

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

#Motorvehicles

మోటారు వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్సులు, ఇతర పత్రాల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. ఫిట్‌నెస్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, ఇతర రవాణా సంబంధిత డాక్యుమెంట్లకు ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది.

2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 మార్చి 31 మధ్య గడువు పూర్తయ్యే పత్రాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

2021 జూన్‌ 30 వరకు ఆ పత్రాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ఇదివరకే నాలుగు సార్లు వాహనాలకు సంబంధించిన పత్రాల గడువును కేంద్రం పొడిగించింది.

Related posts

మూడు భాషల్లో వస్తున్నఅనుష్క నిశ్శబ్దం

Satyam NEWS

కరోనా ఎలర్ట్: ఇంటి నుండి బయటికి ఎవ్వరూ రాకండి

Satyam NEWS

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment