37.2 C
Hyderabad
April 26, 2024 20: 42 PM
Slider మెదక్

దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బిజెపి…

#TRSDubbaka

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో బీజేపీ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని టిఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ర్యాకం శ్రీరాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు గత ఫిబ్రవరి నెలలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని ఢిల్లీలో ఆయన నివాసంలో కలిసి 44 జాతీయ రహదారి చేగుంట సమీపములో రెడ్డిపల్లి బైపాస్ రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకత వివరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నాలుగేళ్లుగా మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి రహదారిని జాతీయ రహదారి గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఎన్నో ప్రతిపాదనలు కూడా పంపించారు. దాని ఫలితమే నేడు కేంద్ర ప్రభుత్వం మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి రహదారిని జాతీయ రహదారి గుర్తించిందని అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి వల్లనే సాధ్యమైందన్నారు.

బిజెపి చెప్పేవన్నీ అసత్యాలే

కానీ బిజెపి పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ జాతీయ రహదారిపై రెడ్డి పల్లి బ్రిడ్జి కోసం కలిసిన ఫోటోను మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి కోసం రఘునందన్ రావు  కృషి చేశారని అసత్య ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. కలిసింది ఒక్కటి, చెప్పుకునేదీ మరొకటి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ దుబ్బాక నియోజక వర్గంలో గెలుపొందారు. ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీకి గుణపాఠం తప్పదన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి వల్లనే రాష్ట్రానికి అభివృద్ధి నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. ప్రస్తుతం దుబ్బాక బిజెపి నాయకులకు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక చేసింది ఏమీ లేక సోషల్ మీడియాలో అన్ని తామే చేస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తు ప్రజల ముందు నవ్వుల పాలవు తున్నారు. తెలంగాణ రైతాంగం కన్నీళ్లు తుడిచే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా ఉత్తరాలు వ్రాస్తూ మోకాలడ్డు పెట్టి, సిగ్గులేకుండా అడ్డుకున్న నేతలు కూడవెల్లికి గోదావరి జలాలు రావడంతోపాటు అటు అభివృద్ధి వేగం కావడం, జాతీయ రహదారి గెజిట్ ప్రచురించడంతో  తమ ఉనికి ఏడ కోల్పోతామేమోనని బిజెపి నాయకులకు భయం పట్టుకుంది.

సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు

ఆ భయంతో తాము చేయలేనివి, చేతకానివీ కూడా తామే చేశామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. చేయని పనులు చేస్తున్నామని నీతిమాలిన రాజకీయాలు చేయడం బిజెపి పార్టీకి వెన్నతోపెట్టిన బుద్ధి అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకు దమ్ముంటే దుబ్బాకలో 52 వేల మంది బీడీ కార్మికులు వీధిన పడుతుంటే కేంద్రాన్ని ఒప్పించి వారి ఉపాధి కల్పించండి.

కేంద్రం బీడీ పరిశ్రమను మూసేస్తే కాపాడలేని చేతకాని దద్దమ్మలు తాము చేయనీ, చేయలేని అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అన్నారు. బీడీ కార్మికులకు కూడా కడుపులో పెట్టుకుని కేసీఆర్ వారికి జీవన భృతి ఇస్తున్నారు. చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పారు.

ఉప ఎన్నికల ముందు ఆదుకుంటామని గొప్పలు చెప్పిన  కేంద్రం,బీజేపీ ప్రభుత్వం వారి కడుపు కొట్టి,అంత్యోదయ కార్డులు రద్దు చేస్తే నోరు విప్పలేదు. దమ్ముంటే అంత్యోదయా  కార్డులను మంజూరు చేయించండి. మీది ప్రశ్నించే గొంతు కదా కేంద్రం చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ అంశాలపై ఎందుకు ప్రశ్నించరు. సిగ్గులేకుండా చేయని అభివృద్ధి చేశామని చెప్పుకుంటారు. కేంద్ర మంత్రిని కలిసింది ఒక్క దానికి,చెప్పుకునేదీ మరో ఒక్కటి. మీరు చేసేది చెప్పాలి కానీ నోటికి ఏది వస్తే అది మేమే చేశామని తప్పుడు ప్రచారం చేయవద్దని మండిపడ్డారు. మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి రహదారిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. బీజేపీ అంటేనే భారతీయ జుటా పార్టీ అని నిరూపించాలని ఎద్దేవా చేశారు.

Related posts

అధికారం దుర్వినియోగం చేస్తున్న సీఐడీ అదనపు డీజీ

Satyam NEWS

ధరణి పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Satyam NEWS

Leave a Comment