38.2 C
Hyderabad
April 29, 2024 21: 01 PM
Slider మెదక్

గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

#harishrao

గజ్వేల్ నియోజకవర్గంలో పదివేల మందికి గృహలక్ష్మి ఇండ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం లో నూతనంగా నిర్మించిన వంద పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నేడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజు 530 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. 300 కోట్లతో నిర్మించుకున్న ఔటర్ రింగ్ రోడ్డుని ప్రారంభించుకున్నాం.

150 కోట్లతో గజ్వేల్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా 36 కోట్లతో వంద పడకల మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఆస్పత్రి ద్వారా గర్భిణీలకు, చిన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందించబడుతుంది. కెసిఆర్ గజ్వేల్ ముఖ్యమంత్రి కావడం మన అందరి అదృష్టం. కేసిఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు కాబట్టే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.

గజ్వేల్ ప్రాంతానికి గతంలో పిల్లని ఇవ్వాలంటే భయపడేవారు నీళ్లు మోపిస్తారేమో అని. ఈరోజు పొయ్యి కాడికి మంచినీళ్లు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కెసిఆర్ కి దక్కుతుంది అని హరీష్ రావు అన్నారు. దేశంలో గజ్వేల్ ఆదర్శ నియోజకవర్గంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూసి అధ్యయనం చేసే స్థాయికి గజ్వేల్ చేరింది. పనిచేసే కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే కెసిఆర్ మన గౌరవం పెంచుతాడు మనల్ని కాపాడుకుంటారు. గజ్వేల్ లో  పదివేల మందికి గృహలక్ష్మి ఇండ్లు సాంక్షన్ చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్.

రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు  జమ చేయబడతాయి. కెసిఆర్ ఒక నమ్మకం కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పిన చెప్పని హామీలన్నీ నెరవేర్చారు. కాంగ్రెస్ అంటే ఒక నాటకం నాటకాలు ఆడే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మనం మోసపోతాం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా, మరింత అభివృద్ధిలో గజ్వేల్ కొనసాగాలన్నా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ని గెల్పించుకోవాలి అనిఆయన పిలుపునిచ్చారు.

Related posts

పుష్యరాగం

Satyam NEWS

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు

Bhavani

విదేశాల్లో యోగ విద్య విస్తరణకు కృషి

Satyam NEWS

Leave a Comment